Ramadan : రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ గంజి…ఎలా తయారు చేస్తారంటే…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 8 April 2024, 3:00 pm
  •  Ramadan : రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ గంజి...ఎలా తయారు చేస్తారంటే...!

Ramadan : ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు నెలరోజుల పాటు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్…ఇక ఈ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులందరూ నెల రోజులపాటు రోజా ఉంటారు. ఈ పండుగలో రోజా అనేది ప్రధానమైనది. రోజా అంటే ఉపవాసం అని అర్థం. ఇక ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా తప్పకుండా రోజా పాటిస్తూ , వారి దేవుని ఆరాధిస్తూ ,ఖురాన్ చదవడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ పండుగ సమయంలో ఎక్కువ శాతం ముస్లింలు అందరూ కూడా మసీదులోనే గడుపుతూ కనిపిస్తారు. అలాగే ఈ పండుగ సందర్భంలో ముస్లిం మత పెద్దలు కూడా మసీదుల్లోనే ప్రార్థనలు చేయాల్సిందిగా అందరికీ చెబుతుంటారు. అయితే ఈ రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైనది ఉపవాసం అని చెప్పాలి. ఇక ఈ ఉపవాసం ముగిసిన తర్వాత వారంతా కలిసి మసీదుల్లో ప్రార్థన ముగించిన తర్వాత ప్రత్యేకించి గంజినే ఆహారంగా తీసుకుంటారు.

Ramadan : రంజాన్ రోజాకు ప్రత్యేక గంజి…

రంజాన్ నెలలో మాత్రమే తయారు చేసే ఈ గంజికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాక చాలా ప్రాంతాలలో ఇఫ్తార్ సమయంలో పండ్లు అల్పాహారం లేకపోయినా సరే గిన్నె గంజి అయినా తప్పక తాగాలని సూచిస్తుంటారు. అయితే ఈ గంజిని చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు తీసుకుని తాగుతారు. మరి రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గంజిని అసలు ఎలా తయారు చేస్తారు… దానిని తాగడం వలన కలిగే లాభాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం…. రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ గంజిని బియ్యం రవ్వ లేదా బొంబాయి రవ్వతో తయారు చేస్తారు. అలాగే దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి ,యాలకులు , లవంగాలు దాల్చిన చెక్క , నెయ్యి వంటి పదార్థాలను కూడా ఉపయోగిస్తారు.. అయితే ఈ గంజి తయారీకి ముందుగా మసాలా దినుసులు అన్నిటిని నెయ్యిలో వేయిస్తారు. అనంతరం ఒక పెద్ద వంట పాత్ర లో నీళ్ళు పోసి బాగా మరగనిస్తారు. నీరు బాగా మరిగిన తర్వాత దీనిలో రవ్వను కలుపుతూ ముందే వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ,సరిపడా ఉప్పు వేసి గంజి చిక్కబడేలా ఉడకనిస్తారు.

Ramadan : రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ గంజి...ఎలా తయారు చేస్తారంటే...!

Ramadan : రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ గంజి…ఎలా తయారు చేస్తారంటే…!

ఈ విధంగా తయారుచేసిన గంజిని అందరికీ పంపిణీీ చేస్తారు. ఇక ఈ గంజిలో కొందరు బూందీ వేసుకుని తినడానికి చాలా ఇష్టపడతారు. మరి కొన్ని చోట్ల ఈ గంజి తయారీకి కొంతమంది ముస్లింలు ఖీమా కూడా వినియోగిస్తారు. అయితే ఉపవాస దీక్షపరుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ గంజిని మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇష్టపడతారని చెప్పాలి. ఇక రంజాన్ నెలలో సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ అని పిలవబడే ప్రార్ధనలో పలు రకాల ఆహార పదార్థాలతో వారి యొక్క ఉపవాసాన్ని విరమిస్తారు. వాటిలో ముందుగా ఖర్జూరం నీరు లేదా పాలతో వారి ఉపవాస దీక్షను విరమిస్తారు. ఖర్జూరం లేదా నీరు తీసుకున్న తర్వాతే వారి భోజనాన్ని స్వీకరిస్తారు. ఈ రంజాన్ మాసం అంతా ఉపవాసం దీక్ష చేసిన తర్వాత చివరి రోజున. ఈద్-ఉల్-ఫితర్ పండుగను రంజాన్ పండుగగా జరుపుకుంటారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  2. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  3. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

  4. "NCC Army Jobs : అమ్మాయిలకు గుడ్ న్యూస్.. NCC ‘C’ సర్టిఫికెట్‌తో నేరుగా ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు"

  5. "Heavy Rain Alert : బిగ్ బ్రేకింగ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్..!"

  6. "Talliki Vandanam 2026 : ఏపీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. తల్లికి వందనం నిధులు విడుదల.. మీ డబ్బులు వచ్చాయో ఇలా చెక్ చేసుకోండి"

  7. "Fact Check PM KISAN : పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్‌.. రూ.6,000 పెంపుపై కేంద్రం ఫుల్ క్లారిటీ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి