Vastu Tips : సంపాదించిన డబ్బు నిలవాలంటే… ఈ మూడు తప్పులు చేయకండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vastu Tips : సంపాదించిన డబ్బు నిలవాలంటే… ఈ మూడు తప్పులు చేయకండి…

 Authored By prabhas | The Telugu News | Updated on :28 July 2022,7:00 am

Vastu Tips : చాలామంది ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు. కానీ కొందరికి ఎంత సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవదు. అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగతీస్తుంటాయి. తాను చేసే పనితో ఎటువంటి మోసాలు లేకుండా ప్రయత్నించిన, వారు మాత్రం విజయం సాధించలేరు. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో డబ్బు నిలవదు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వారు పేదవారిగా మారుతారు. అయితే అటువంటి వారు కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవడం మంచిది. వాస్తు శాస్త్ర ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం, వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు వారిని జీవితంలో వెనక్కి లాగుతూ ఉంటాయి. అయితే ఇంట్లో ప్రధానంగా మూడు మూలల ప్రభావం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ మూడు మూలలు గురించి తెలుసుకుందాం.

వాటర్ ట్యాంక్ ఈ దిశలో ఉంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.ఇంటి పైకప్పు మీద ఉండే వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో ఉంచితే చాలా నష్టం జరుగుతుంది. ఈ దిశలో వాటర్ ట్యాంక్ పెడితే ఆ ఇల్లు పేదరికం అనుభవించక తప్పదు. వాస్తవానికి ఆగ్నేయ దిశ అగ్ని ప్రదేశం. అగ్ని స్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. దీని వలన వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు ఇంట్లో తరచూ గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి. అందుకనే వాటర్ ట్యాంకును నైరుతి దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది. నైరుతి దిశ సానుకూల ప్రతికూల శక్తులను సమతుల్యం చేస్తుంది. అలాగే వాటర్ ట్యాంకును దక్షిణ దిశలో ఉంచిన మంచిదే. దక్షిణ దిశలో వాటర్ ట్యాంకులు నిర్మిస్తే ట్యాంక్ స్లాబ్ కు మధ్య కనీసం ఒకటి రెండు అడుగుల ఖాళీ స్థలం ఉండేలా నిర్మించాలి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం మరుగుదొడ్లను ఈశాన్య దిశలో నిర్మించకూడదు.

Vastu Tips for money problems

Vastu Tips for money problems

ఇలా నిర్మించడం వలన ఆ వ్యక్తికి డబ్బు సమస్యలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వలన ఆర్థికంగా బలహీన కావడం కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇంటికి ఈశాన్య దిశలో ఎప్పుడూ మరుగుదొడ్డి ని నిర్మించకూడదు. ఈశాన్య దిశలో మరుగుదొడ్లు ఉంటే ఎంత కష్టపడినా ఫలితం మాత్రం బూడిదలో పోసిన పన్నీరు గానే మారుతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు దుమ్ము ధూళి లేకుండా చెత్తచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ దిశలో కుబేరుడు ఉంటాడు. కుబేరుడు ఉండే స్థానంలో ఎప్పుడు చెత్తాచెదారం వేయకూడదు. అలా వేస్తే పేదరికానికి గురవుతారు. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి బారిన పడతారు. ఉత్తర దిశ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. కాబట్టి ఉత్తర దిక్కులో ఎటువంటి చెత్తాచెదారం వేయకూడదు. ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది. ముఖ్యంగా ఈ మూడు విషయాలు గుర్తు పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది