Vrushabha Rasi : గురు పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారి జీవితంలోపెను మార్పులు… నక్కతో ఒక తొక్కినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vrushabha Rasi : గురు పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారి జీవితంలోపెను మార్పులు… నక్కతో ఒక తొక్కినట్లే…!

 Authored By ramu | The Telugu News | Updated on :16 July 2024,2:00 pm

Vrushabha Rasi : వృషభ రాశి వారికి గురు పౌర్ణమి తర్వాత వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి…? అలాగే వీరి యొక్క ఆరోగ్యం , ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది..? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కొన్ని సమయాల్లో ఊహించని సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో వారు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఎలాంటి మాటలు కూడా జారకుండా నిష్టగా ఉన్నట్లయితే వారికి నెల ఆఖరిలోపు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి ఎవరైతే ఓపికతో ఉంటారో వారు ప్రతి విషయంలోనూ విజయాలను సాధిస్తారు. అలాగే రాజకీయ నాయకులకి ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి వాహన ప్రయాణ విషయాలలో జాగ్రత్త వహించాలి. రాత్రిపూట ప్రయాణం చేసే వారు ఉన్నట్లయితే దానిని వాయిదా వేసుకోవడం వలన మీ ప్రాణాన్ని కాపాడుకున్న వారవుతారు.

కుటుంబ పరంగా మంచి సమయాన్ని గడుపుతారు. గతంలో చేసిన అప్పులను తీర్చలేక ఒత్తిడికి గురవుతారు. అటువంటి వారికి ఈ యొక్క మాసం చాలా కలిసి వస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ నెలలో ఒక అదృష్టం వస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారాలను విడిచిపెట్టడం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచిగా కలిసి రావడం కూడా జరుగుతుంది. ఈనెల ఆఖరిలో విశేషమైన ఫలితాలను వృషభ రాశి వారు పొందుతారు. దాని ద్వారా కొంత ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. విదేశాలలో ఉన్నటువంటి వారికి మాసానంతరంలో ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్స్ రావడం జరుగుతుంది. స్వదేశంలో భారత భూమి రుణాన్ని తీర్చుకున్నటువంటి అవకాశం కూడా ఈ వృషభ రాశి వారిలో కొంతమందికి ఉంటుంది. నాయకుల మరియు బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. ఎలాంటి సందర్భంలో అయినా వీరి యొక్క చేష్టల వల్లనే కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ గ్రహస్థితి వలన కాదు.

Vrushabha Rasi గురు పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారి జీవితంలోపెను మార్పులు నక్కతో ఒక తొక్కినట్లే

Vrushabha Rasi : గురు పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారి జీవితంలోపెను మార్పులు… నక్కతో ఒక తొక్కినట్లే…!

Vrushabha Rasi  పరిహారాలు

సుబ్రహ్మణ్యేశ్వరుని ఈ జులై నెలలో ఆరాధన చేయండి. మంగళవారం రోజు సుబ్రమణ్య క్షేత్రాలలో అన్నదానాలలో పాల్గొనండి. అలాగే కందిపప్పుతో చేసిన వంటకాన్ని అన్నదానంలో సమర్పణ చేయండి. దీని ద్వారా వృషభ రాశి వారు అపార కీర్తివంతులవుతారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది