Guru Pournami : గురు పౌర్ణమి ఎప్పుడంటే… ఏ సమయంలో పూజ చేసుకుంటే మంచిది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guru Pournami : గురు పౌర్ణమి ఎప్పుడంటే… ఏ సమయంలో పూజ చేసుకుంటే మంచిది…!

Guru Pournami : గురు పౌర్ణమిని ఏ రోజున జరుపుకోవాలి..? పౌర్ణమి ఘడియలు ఎప్పుడు..? అలాగే గురు పౌర్ణమి రోజున ఏ విధమైన పూజలు జరుపుకోవాలి..? ఈ వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆషాడ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది. అయితే గురు పౌర్ణమి అనేది రెండు రోజులు వస్తుంది. 20 , 21వ తేదీన పౌర్ణమి ఘడియలు పూర్తిగా ఉన్నాయి. 20వ తేదీ శనివారం సాయంత్రం 5.23 నిమిషాల నుండి పౌర్ణమి ప్రారంభమైనది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 July 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Guru Pournami : గురు పౌర్ణమి ఎప్పుడంటే... ఏ సమయంలో పూజ చేసుకుంటే మంచిది...!

Guru Pournami : గురు పౌర్ణమిని ఏ రోజున జరుపుకోవాలి..? పౌర్ణమి ఘడియలు ఎప్పుడు..? అలాగే గురు పౌర్ణమి రోజున ఏ విధమైన పూజలు జరుపుకోవాలి..? ఈ వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆషాడ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది. అయితే గురు పౌర్ణమి అనేది రెండు రోజులు వస్తుంది. 20 , 21వ తేదీన పౌర్ణమి ఘడియలు పూర్తిగా ఉన్నాయి. 20వ తేదీ శనివారం సాయంత్రం 5.23 నిమిషాల నుండి పౌర్ణమి ప్రారంభమైనది. అలాగే 21వ తేదీ ఆదివారం పౌర్ణమి సాయంత్రం 4 :15 వరకు మాత్రమే ఉంది. అయితే నార్త్ ఇండియా సూర్యోదయ కాలానికి ఏ తిధి ఉంటే ఆ రోజున చేసుకోమని నార్త్ ఇండియా వాళ్ళు పాటిస్తారు. కాబట్టి వాళ్లు గురు పౌర్ణమి ఆదివారం అని పెట్టుకున్నారు.

కానీ దక్షిణ భారతీయ సాంప్రదాయాలలో పౌర్ణమి ఘడియలు ఎప్పుడు వస్తే అప్పుడు గురు పౌర్ణమి ప్రారంభమవుతుంది. కావున గురు పౌర్ణమి ప్రారంభం శనివారం సాయంత్రం నుండి ఇంట్లో దీపాలను పెట్టుకోవాలి. ఆ కండగల కారుడైన పరమాత్మకు అఖండ దీపం పెట్టండి. గురుపౌర్ణమి నాడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుందాం.సాయంత్రం ఒక బూడిద గుమ్మడికాయ నీ అడ్డంగా కోసి గుజ్జు తీసేసి అందులో నువ్వుల నూనె పోసి అఖండ దీపాన్ని వెలిగించండి. దీపం నల్లని వత్తితో పెట్టాలి. దీని ద్వారా మీ అజ్ఞానం నశిస్తుంది. అయితే ఈ దీపం ఆదివారం నాలుగు గంటల 10 నిమిషాల వరకు ఉండాలి. కాబట్టి అప్పటివరకు అఖండ దీపం వెలిగేలా చూసుకోవాలి. ఈ పౌర్ణమి సమయంలో గురు దత్తాత్రేయ స్వామివారిని అలాగే జగద్గురు అయిన ఆదిశంకర స్వామి వారిని మరియు శ్రీకృష్ణ పరమాత్ముడిని , దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి , పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని పూజించుకోవాలి. స్వామివారి ఫోటోని పెట్టుకుని పువ్వులతో అలంకరించుకోవాలి.

Guru Pournami గురు పౌర్ణమి ఎప్పుడంటే ఏ సమయంలో పూజ చేసుకుంటే మంచిది

Guru Pournami : గురు పౌర్ణమి ఎప్పుడంటే… ఏ సమయంలో పూజ చేసుకుంటే మంచిది…!

ఒక కలసాన్ని తీసుకొని దానిపైన కొబ్బరికాయ నీ పెట్టండి. దానికి ఒక ఎర్రటి జాకెట్ గుడ్డని చుట్టండి దానికి ఒక పసుపు కొమ్మును కట్టి దానిని తమలపాకులు మీద నిలబెట్టండి. ఆ కలశం లో కొన్ని నీళ్లు కుంకుమ అక్షతలు వెయ్యండి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పారాయణం చేసుకోండి. అలాగే స్వామివారికి ప్రసాదం పెట్టండి. లేదా ప్రసాదంగా పండ్లను లేదా పాలను స్వామివారికి సమర్పించండి. పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి. “దిగంబరా దిగంబరా లక్ష్మి నరసింహ స్వామి దిగంబర..దిగంబరా దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర ” అనే మంత్రాన్ని గనుక చదువుకుంటే గురుదేవులైన దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహం మీకు లభిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది