Astrology Tips : ఆదాయాన్ని, పొదుపును పెంచుకోవాలనుకుంటే ఈ ఐదు పనులు కచ్చితంగా చేయాల్సిందే!

Authored By pavan J | The Telugu News | Published on: May 26, 2022, 7:40 am

Astrology Tips : ప్రస్తుత కాలంలో మనిషి చేసే మంచి పనులకు విలువ ఇవ్వాల్సింది పోయి… వారి ఆర్థిక స్థితిని చూసి గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. చేతిలో రూపాయి లేకపోతే ఎంత మంచివాడినైనా హీనంగా చూస్తారు. అదే తప్పులు చేస్తూ కోట్లు సంపాదించే వారిని నెత్తిన పెట్టుకుని చూస్కుంటారు. నేటి సమాజ స్థితే ఇలా ఉంది. అయితే అందుకే అందరూ డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయంగా బతుకుతున్నారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో వ్యక్తి సమాజంలో గుర్తింపు పొందుతూ… ధనవంతుడిగా జీవించాలని కోరుకుంటున్నాడు. అలా కోరుకోవడం తప్పు కూడా కాదు. అయితే ఎంత కష్టపడినా కొంత మంది ఆ స్థాయికి చేరుకోలేరు. దీనికి అనే కారణాలు ఉన్నాయి. ఆదాయం ఉన్న పొదుపు చేసే తెలివితేటలు లేకపోతే నష్టాలు రావడం,

ఆర్థికంగా అదే స్థాయిలో ఉండిపోవడం జరుగుతుంటుంది. వీటికి తోడు చాలా మంది గ్రహస్థితే ఇందుకు కారణం అనుకుంటున్నారు. ఏం చేస్తాం ఎంత సంపాదించినా అదృష్టం లేకపోతే అంతే కాలాన్ని గడిపేస్తున్నారు. అలాంటి వారి కోసమే జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అయితే అవేంటి, ఆర్థిక సమస్యల నుంచి బయట పడి ధనవంతులుగా ఎలా మారచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.వృత్తిలో విజయం, గౌరవం, పురోగతి ఇచ్చే గ్రహం సూర్యుడు అంటారు. అందుకే ప్రతిరోజూ ఉదయం స్నానం చేయగానే సూర్యుడికి అర్ఘ్యాన్ని తప్పక సమర్పించాలట. ఇలా చేస్తే కెరియర్ లో ఉన్న అడ్డుంకులు తొలగుతాయట.

Astrology Tips For Earning And Saving Money

Astrology Tips For Earning And Saving Money

  • అలాగే మన హిందూ సంప్రదాయాల ప్రకారం తులసీ చెట్టును లక్ష్మీ దేవిగా భావిస్తాం. లక్ష్మీ దేవి మన ఇంట్లో నిలవాలంటే నిత్యం తులసి చెట్టుకు పూజ చేయాలని వేద పండితులు వివరిస్తున్నారు. నీళ్లు పోస్తూ… దీపారాధన చేయాలని వివరిస్తున్నారు.
  • లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కనకారా స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం చదవడం చాలా మంచిదట. అలా చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయట. అంతే కాకుండా లక్ష్మీ దేవి కృప మనపై ఉండి ఆదాయ మార్గాలు పెరుగుతాయట.
  • శివుడి అనుగ్రహం వల్ల అన్ని బాధల పోతాయట. ఇది జీవితంలో అపారమైన ఆనందాన్ని శ్రేయస్సును కూడా ఇస్తుంది. అందుకే ప్రతిరోజూ శివ లింగానికి అభిషేకం చేయడం మంచిది. వీలైతే పాలు కలిపిన నీటితో అభిషేకం చేయండి.

pavan J

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp