Astrology Tips : ఆడవాళ్లు ఈ రోజుల్లో తల స్నానం చేయకూడదు… అలా చేస్తే ఎమౌతుందంటే…?
Astrology Tips : మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉదయం పూటనే స్నానాలు చేయాలని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. సూర్యోదయం కాకముందే స్నానం చేస్తే చాలా మంచిదంటారు. అయితే మన సాంప్రదాయాల ప్రకారం కొన్ని వారాల్లో తలస్నానం చేయకూడదని చెబుతుంటారు. అంతే కాదు కొన్ని రోజుల్లో కచ్చితంగా తలస్నానం చేయాలని కూడా అంటుంటారు. తలస్నానం అనేది రోజు చేసేందుకు అందరికీ వీలుకాదు. అలాంటివారు వారానికి రెండు మూడు సార్లు తలస్నానం చేస్తారు. అయితే ఏ రోజుల్లో తలస్నానం చేయాలి. ఏ రోజుల్లో చేయకూడదు అనేది మాత్రం చాలామందికి తెలియదు. ముఖ్యంగా పెళ్లయిన ఆడవారు ఏ రోజుల్లో తల స్నానం చేయాలి, ఏ రోజుల్లో చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లయిన ఆడవారు తలస్నానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మంగళవారం, గురువారం, శనివారాల్లో వివాహిత స్త్రీలు తలస్నానం చేయకూడదని నమ్ముతారు. ఈ రోజుల్లో తలస్నానం చేయడం స్ర్తీలకు వారి కుటుంబాలకు మంచిది కాదంటారు. కొన్ని ప్రాంతాలలో సోమవారం తలస్నానం చేయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. ఇది కుటుంబంలోని వ్యక్తుల ప్రగతిపై చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఈ వారం రోజులలో కాకుండా అమావాస్య, పూర్ణిమ, ఏకాదశినాడు స్త్రీలు తల స్నానం చేయకూడదు.
కానీ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే తల స్నానం చేయవచ్చు. అలాగే పెళ్లయిన ఆడవారు ఉపవాసానికి ఒకరోజు ముందు వారి జుట్టును కడగాలి. అయితే మంగళవారం నాడు తలస్నానం చేయాల్సి వస్తే జామకాయ రసం లేదా జామకాయని పేస్ట్ చేసి వారిని తలకు పట్టించాలి. అలాగే బుధవారం తలస్నానం చేయాల్సి వస్తే ముందుగా తులసి ఆకుల పేస్టుని జుట్టుకు పట్టించి ఆ తర్వాత తలస్నానం చేయాలి. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయడం వలన ఇంట్లో ఐశ్వర్యం ఉండదు. కాబట్టి గురువారం నాడు తలస్నానం చేయాల్సి వస్తే కొద్దిగా పసుపు కలిపి తల స్నానం చేయాలి. ఇక పెళ్లయిన స్రీలు చేయడానికి వారంలో శుక్రవారం, ఆదివారం ఉత్తమ రోజులు.