Shravana Amavasya : ఆగస్టు 16 శక్తివంతమైన శ్రావణ అమావాస్య ఆడవారు ప్రాణం పోయినా ఈ రెండు పనులు అస్సలు చేయకండి…
Shravana Amavasya : ఆగస్టు 16 శక్తివంతమైన అమావాస్య ఆడవారు ప్రాణం పోయినా సరే ఈ రెండు పనులు అస్సలు చేయకండి.. మరి ఆగస్టు 16న శక్తివంతమైనటువంటి శ్రావణ అమావాస్యని ఏ విధంగా జరుపుకోవాలి. శ్రావణ అమావాస్య ప్రాముఖ్యత ఏంటి అసలు ఆడవారు ఈ శ్రావణ అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదు.. అనే విశేషాలు మనం తెలుసుకుందాం. అమావాస్య . ఈ రోజున చంద్రుడు అసలు కనిపించడు. ఈ రోజు నా శివుని అత్యధికంగా పూజిస్తూ ఉంటారు. ఇది శివ భక్తులకు చాలా ముఖ్యమైనది. శివున్ని కొలిచేవారు ఈరోజు ఉపవాసం ఉంటారు. శ్రావణ అధిక అమావాస్య అనేది అరుదైన సందర్భం ఇది చాలామంది అనుచరులకు శుభం. మరియు ముఖ్యమైనది. ఇది చాలామంది భక్తులు శుభప్రదంగా ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. ఇకపోతే అధిక శ్రావణ అమావాస్య రోజు విశ్వం యొక్క శక్తి మరింత తీవ్రంగా ఉంటుంది అని నమ్ముతారు.
ఇది ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు ఆచారాలకు తగినటువంటి రోజులు కావడం వల్ల దీనిని అత్యంత భక్తి పూర్వకంగా పూజలు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజుల్లో ఆత్మలు మరింత శక్తివంతంగా ఉంటాయని నమ్ముతారు. కాబట్టి ఏదైనా చెడు చేయడం లేదా ఏదైనా ప్రతికూల ఆలోచనలు చేయడం ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. ఈరోజు తులసి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే దారిద్రం అనేది తొలగిపోతుంది. మరోవైపు తెల్లవారుజామున ఎవరైతే తులసి చెట్టుకు నీరు పోసి తులసి మొదట్లో ఉన్న మట్టిని కాస్త తిలకంగా పెట్టుకుని అలాగే అదే రోజు సాయంకాలం ఆవు నేతితో తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కొలువై ఉంటుంది. ఇక ఇంట్లో ఉండే ప్రతికూల సమస్యలన్నీ తొలగించుకోవాలి అంటే ఈ శ్రావణ అధిక అమావాస్య రోజు సాయంత్రం ఒక అర లీటరు నీటిలో ఒక 50 గ్రాముల వరకు రాళ్ల ఉప్పు మాత్రమే వేసి ఇల్లు ఎవరైతే తడి బట్ట పెట్టుకుంటారో వారి ఇంట ప్రతికూల శక్తులు అనేవి తొలగిపోతాయి.
అలాగే అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని కనుక ఎవరైతే ఆహారంగా పెడతారో వారి ఇంట కష్టాలన్నీ కూడా తీరిపోయి వారి యొక్క కోరికలన్నీ తీరుతాయి. అంతేకాకుండా చాలామంది నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే శ్రావణ అధిక అమావాస్య రోజు ఆడవారు రెండు తప్పులు అయితే అస్సలు చేయకూడదు. ఈ అమావాస్య రోజు అస్సలు తలస్నానం అనేది చేయకూడదు. షాంపూ, కుంకుడుకాయ పెట్టి ఎవరైతే తలంటుకుంటారో వారి యొక్క భర్తకు ఆయుక్షణం అవుతుంది. అని పురాణాలు చెబుతున్నాయి.
ఇక ఈరోజు ఎవరైతే పెరుగుని ఎండుమిరపకాయలను దానం ఇస్తారో లేదా అప్పుగా తెచ్చుకుంటారో వారికి నిత్యం కష్టాలు, దరిద్రలు అనేవి తొంగి చూస్తూనే ఉంటాయి. కాబట్టి అసలు మరిచిపోయి కూడా ఎవరూ పెరుగుని ఎండుమిరపకాయలని దానం చేయవద్దు. ఏరి కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది. మరి ఈ రెండు తప్పులు కనుక చేయకుండా ఉన్నట్టయితే లక్ష్మీదేవి మీ ఇంట తాండవిస్తుంది. కాబట్టి ఈ శ్రావణ అధిక అమావాస్యను చక్కగా ఉపయోగించుకుని శివాలయానికి కానీ వైష్ణవాలయానికి కానీ వెళ్లి ఆ స్వామి వారి దర్శనం చేసుకుని తులసి మాతాకీ ప్రదక్షిణాలు చేసి కానీ రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేస్తే చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయి…