Temple : ఆలయం నీడ ఇంటిపై పడితే అరిష్టమా..? ఇందులో నిజమెంతా..?
Temple : హిందూ సంప్రదాయం ప్రకారం దేవాలయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ప్రతీ ఊళ్లో గుడులు ఉండటం సహజం. ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని చాలా పవిత్రమైన స్థలంగా భావిస్తుంటారు హిందువులు. ప్రతి నిత్యం పూజలు, హోమాలు చేస్తూ.. ప్రశాంతతను పొందుతారు. అయితే ఇలాంటి పవిత్రమైన గుడులకు ఇళ్లు దగ్గరగా ఉంటే బాగుండని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ పురాణాల ప్రకారం ఆలయాలకు దగ్గర్లో నివాస స్థలాలు ఉండటం మంచిది కాదని చెబుతున్నాయి. అదేంటీ స్మశాన వాటికలు దగ్గరగా ఉంటే చెడు జరుగుతుందని భావించాలి కానీ… ఆలయాలకు దగ్గరగా ఉండే అరిష్టం అని ఉండటం ఏంటని భావిస్తున్నారా…! అవునండీ గుడులకు ఇళ్లు దగ్గరగా ఉండకూడదట. అలా ఉండటం వల్ల మనకు అరిష్టం కల్గుతుందని వాస్తు శాస్త్రంలో కూడా ఉంది.
గుడిని ఆనుకొని ఇళ్లు ఉన్నా లేదా ఆలయానికి దగ్గర్లో అంటే… ఆలయం లేదా ఆలయ ధ్వజ స్తంభం నీడ నివాస స్థలాల మీద పడ్డా మంచిది కాదట. అలాంటి చోట్లలో ఇళ్లు ఉంటే ప్రతిరోజూ ఆ కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటాయట. కనీసం గుడికి 200 అడుగుల దూరంలో ఉండేలా ఇళ్లు తీసుకోవడం లేదా కట్టుకోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతే కాదండోయ్ ఇంటికి, గుడికి ఉండే దూరాన్ని గర్భ గుడిలో ఉన్న మూల విరాట్టు విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుక వైపు, విష్ణు ఆలయానికి ముందు వైపు ఇల్లు ఉంటే ఎటువంటి సమస్యా ఉండదట. అమ్మవారి ఆలయానికి దగ్గర్లో ఉన్న ఇంట్లో డబ్బు అస్సలే నిలవదట.
అంతే కాకుండా ఎప్పటికీ ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి సాధించలేరని పండితులు చెబుతున్నారు. అలాగే వినాయకుడి ఆలయానికి ఉత్తరాన. వాయువ్యంలో ఇల్లు ఉన్న వారికి ధన నష్టంతో పాటు అమానాలు ఎదురవుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. విపరీతమైన వృథఆ ఖర్చులు ఉంటాయ. ఆలయాల ధ్వజ స్తంభం నీడ కూడా ఇళ్ల మీద పడకూడదంట.ఆగమ శాస్త్రం ప్రకారం… దేవాలయాలను నిర్మించేటప్పుడు మంత్ర, తంత్ర శక్తులతో గోపురాన్ని, ధ్వజ స్తంభాన్ని నిర్మిస్తుంటారు. వేద పండితుల నడుమ మంత్రోచ్ఛారణలతో ఎంతో శక్తివంతమైన విగ్రహాలను ప్రతిష్టిస్తారు. సాధారణంగా ప్రతీ ఇంట్లో అశుభ కార్యాలు జరుగుతుంటాయి. గుడులకు దగ్గరగా ఉన్న ఇంట్లో అశుభ కార్యాలు జరిగితే వాటి ప్రభావం.. శక్తివంతమైన గుడి గోపురం, ధ్వజ స్తంభాలపై పడకూడదనే ఉద్దేశ్యంతోనే ఆలయాలకు దగ్గర్లో ఇళ్లు ఉండకూడదని చెబుతుంటారు.