Chanakya Niti : ఈ పనుల చేసిన వెంటనే స్నానం తప్పనిసరి అంటున్న చాణక్య..
Chanakya Niti : చాణక్యుడు.. కౌటిల్యుడు.. విష్ణు గుప్తుడు.. పేర్లు కలిగిన ఆచార్య చాణక్య నీతి శాస్త్రం గురించి అందరికి తెలిసిందే. ఆచార్య తన జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలను, అనుభవాలను చాణక్య నీతిలో తెలిపారు. ఇవి నేటికీ అందరికీ స్పూర్తిదాయకంగా ఉన్నాయి. నీతి శాస్త్రంలో సంతోషకరమైన జీవితం, పురోగతి గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు. నేటికీ ప్రజలు జీవితాన్ని సంతోషంగా గడపడానికి, విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఈయన విషయాలను పాటిస్తారు. చాణక్యకు జీవితంలో వివిధ అంశాలపై మంచి అవగాహన ఉంది.
అర్థశాస్త్రంతో పాటు, సామాజిక, రాజకీయ, సైనిక శాస్త్రం, దౌత్యం, మతం మొదలైన అంశాలలో చాణక్యుడు మంచి పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. అందుకే చాణక్య బోధనలు ఇప్పటికీ అందరికీ స్ఫూర్తినిస్తాయి.ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం.. పరిశుభ్రతతోపాటు ఆరోగ్యరీత్యా కూడా స్నానం ఎంతో మంచిదని చాణక్య తెలిపారు. అంత్యక్రియలకు హాజరైన వ్యక్తి ఇంట్లోకి వచ్చే ముందు తప్పనిసరిగా స్నానం చేయాలని సూచించారు. మనిషి మరణం తర్వాత అతని శరీరం సూక్ష్మక్రిములతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మృతదేహాన్ని తాకినప్పుడు ఇతరులకు అనారోగ్యం వాటిల్లే ప్రమాదం ఉంటుందన్నారు.
ఆరోగ్యకరమైన శరీరం, మెరిసే చర్మం కోసం మసాజ్ చేయాలని చాణక్య సూచించారు. శరీరానికి నూనెను పూయడం వల్ల శరీరంలోని మురికి బయటకు పోతుంది. అందుకే మసాజ్ చేసిన తర్వాత కాసేపు ఆగి తలస్నానం చేయాలని చాణక్య సూచించారు. అలాగే హెయిర్‌కట్ చేయించుకున్న తర్వాత కూడా స్నానం చేయాలని చాణక్య సూచించారు. వెంట్రుకలు శరీరంలో అక్కడక్కడా అతుక్కుపోయి అనారోగ్యం వాటిల్లేలా చేస్తాయని చాణక్య తెలిపారు. అందుకే జుట్టుకత్తిరంచుకున్న తర్వాత తప్పనిసరిగా తల స్నానం చేయాలని సూచించారు.