Ekadashi : సెప్టెంబర్ లో రెండుసార్లు ఏర్పడనున్న ఏకాదశి తిధి… ఈ సమయంలో ఇలా చేస్తే…!
ప్రధానాంశాలు:
Ekadashi : సెప్టెంబర్ లో రెండుసార్లు ఏర్పడనున్న ఏకాదశి తిధి... ఈ సమయంలో ఇలా చేస్తే...!
Ekadashi : హిందూ సాంప్రదాయాలలో ఏకాదశి ఉపవాసానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఏకాదశి తిధిలో ఉపవాసం పూజలకు ప్రత్యేకత ఉంటుంది. ఏకాదశి శ్రీమహావిష్ణువు కి అంకితం చేయబడినది. ఇక ఈ రోజున భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సర్వపాపాలు తొలగి మోక్షాన్ని పొందుతారని భక్తుల నమ్మకం. ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు ను పొందవచ్చు. ఏకాదశి ఉపవాసాన్ని పాటించే వారికి సెప్టెంబర్ నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో రెండు ఏకాదశి తిధులు వస్తాయి.
Ekadashi : పరివర్తిని ఏకాదశి 2024.
పరివర్తిని ఏకాదశిని భక్తులు పవిత్రమైన ఏకాదశిగా భావిస్తారు. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువుని పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి. 14 సెప్టెంబర్ 2024 శనివారం నాడు పరివర్తిని ఏకాదశి ఉపవాసం పాటించబడుతుంది. మరుసటి రోజు 15వ తేదీన ఈ దీక్షను విరమించాలి.
Ekadashi ఇందిరా ఏకాదశి 2024.
హిందూమతంలో ఇంద్ర ఏకాదశిని ప్రధాన ఏకాదశి గా పిలవబడుతుంది. ఈ రోజున ఆచరించే ఉపవాసం పూర్వికుల శాంతి ఆత్మల మోక్షానికి అంకితం. అయితే సెప్టెంబర్ నెల భద్రపాద మాసంలో వచ్చే కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని ఇందిరా ఏకాదశిగా నిర్వహిస్తారు. ఇక 28 సెప్టెంబర్ 2024 ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరింపబడుతుంది. అలాగే దీనిని మరుసటి రోజు సెప్టెంబర్ 29వ తేదీన విరమించాలి.
ఏకాదశి వ్రత ప్రాముఖ్యత
హిందూమతంలో ఏకాదశి ఉపవాసానికి గొప్ప ఉపవాసంగా పరిగణిస్తారు. ఇది ప్రతి నెల 11వ రోజున ఆచరింపబడుతుంది. ఏకాదశి అంటేనే 11. అయితే ఈ ఉపవాసం శ్రీమహావిష్ణువుకి అంకితం చేయబడింది. సాంప్రదాయాల ప్రకారం ఏకాదశి తిధి రోజున ఉపవాసం ఆచరించడం వలన సర్వపాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా ఏకాదశిలో మోహిని ఏకాదశి, యోగినీ ఏకాదశి, నిర్జల ఏకాదశి, కామిని ఏకాదశి , వంటి ఏకాదశి తిధి ఉపవాసాలు ఉంటాయి. ఇందులో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది.
అదేవిధంగా భిన్నమైన పూజా విధానాలు ప్రాముఖ్యత ఉంటుంది. ఇక చంద్ర గమనం ప్రకారం నెలలో రెండుసార్లు ఏకాదశి తిధి వస్తుంది. ఇలా ప్రతి నెలలో రెండు ఏకాదశి ఉపవాసాలను ఆచరిస్తారు. ఏడాదికి 24 ఏకాదశి ఉపవాసాలు ఉంటాయి. కొంతమంది ఉపవాసం ఆచరించే సమయంలో నీరు ఆహారం వంటివి తీసుకోరు. రోజంతా విష్ణువు మంత్రాలను పటిస్తూ కీర్తనలతో భజనలతో గడుపుతారు. ఈ వ్రతాన్ని పాటించడం వలన మానసిక ప్రశాంతత ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశి రోజున దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.