Ekadashi : వివాహంలో ఆటంకమా… ఏకాదశి రోజు ఇలా చేస్తే అనుకున్నది జరిగినట్లే…!
ప్రధానాంశాలు:
Ekadashi : వివాహంలో ఆటంకమా... ఏకాదశి రోజు ఇలా చేస్తే అనుకున్నది జరిగినట్లే...!
Ekadashi : వేద శాస్త్రంలో కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిధిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. అదేవిధంగా ఈ ఉత్థాన ఏకాదశిని ప్రబోధిని హరిబోధిని, దేవోత్తని ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. శ్రీమహావిష్ణువు నాలుగు నెలల యోగ నిద్ర నుంచి ఈ రోజున మేల్కొంటాడు. తిరిగి విశ్వాసాన్ని నడిపించే బాధ్యతను స్వీకరిస్తాడు. ఇక విష్ణువు మేల్కొన్న తర్వాత నుండి పెళ్లిళ్లు శుభకార్యాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏడాది ఉత్థాన ఏకాదశి నవంబర్ 12, 2024న వచ్చింది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారి జీవితంలో వచ్చే ప్రతి దుఃఖం తొలగిపోతుందని మత విశ్వాసం.
కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఉత్థాన ఏకాదశి రోజున లక్ష్మీదేవిని మరియు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున నిర్వహించే పూజలు దానాలతో ఎటువంటి పాపమైనా నశిస్తుంది. ముఖ్యంగా వివాహం ఆలస్యమైన వారు లేదా పెళ్లి కుదిరి చెడిపోతూ ఉంటే ఈ నూతన ఏకాదశి రోజున కొన్ని ముఖ్యమైన చర్యలను చేయవలసి ఉంటుంది. దీంతో పెళ్లి సమస్యలు తీరడంతో పాటు కోరుకున్న వధూవరులు లభిస్తారని నమ్మకం.
Ekadashi : ఉత్థాన ఏకాదశి 2024 ఎప్పుడు..
వేద పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే కార్తీకమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిధి 11 నవంబర్ 2024 తేదీన సాయంత్రం 6:46 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 12 నవంబర్ 2024వ తేదీన సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలోనే 12 నవంబర్ 2024వ తేదీ ఉదయం తిది ప్రకారం ఉత్థాన ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాల్సి ఉంటుంది.
Ekadashi ఉత్థాన ఏకాదశి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి…
ఉత్థాన ఏకాదశి ఉపవాసాన్ని ద్వాదశి తిధి రోజున ఉపవాసాన్ని విరమిస్తారు. అదేవిధంగా నవంబర్ 13వ తేదీ నా ఉదయం 6:42 నుండి 8:51 మధ్య సమయంలో ఉత్థాన ఏకాదశి వ్రతాన్ని విరమించవచ్చు.
ఉత్థాన ఏకాదశి రోజున ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే..
– అమ్మాయి లేదా అబ్బాయికి వివాహ విషయంలో ఏదైనా అడ్డంకులు వచ్చినట్లయితే వారు ఉత్థాన ఏకాదశి రోజున కొన్ని చర్యలను తీసుకోవడం వలన అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
– ఉత్థాన ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం కోసం కుంకుమ పసుపు గంధం లేదా పసుపుని ఉపయోగించవచ్చు. అలాగే శ్రీహరికి పసుపులను సమర్పించడం మంచిది. స్వామివారికి నైవేద్యంగా పులిహోర లడ్డు మిఠాయిలను సమర్పించండి. దీని ద్వారా వివాహం త్వరగా అవుతుంది.
– ఏమైనా కోరికలు కోరుకోవాలంటే ఉత్థాన ఏకాదశి రోజున రావి చెట్టుకు నీరు సమర్పించండి. ఎందుకంటే రావి చెట్టులో శ్రీమహావిష్ణువు నివాసం ఉంటాడు. కాబట్టి ఉత్థాన ఏకాదశి రోజున రావి చెట్టుకి నీటిని సమర్పించడంతో కోరికలు నెరవేరుతాయి.
– ఉత్థాన ఏకాదశి రోజున తులసీకళ్యాణం జరిపించడం శుభప్రదం. దీని వలన వివాహ సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి.
– ఉత్థాన ఏకాదశి రోజున తులసి మొక్కకు పచ్చి పాలులో చెరుకు రసాన్ని కలిపి నైవేద్యంగా సమర్పించండి. అలాగే తులసి మొక్క దగ్గర ఐదు దీపాలను వెలిగించండి దీంతో వివాహాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
Ekadashi ఉత్థాన ఏకాదశి రోజున చేయవలసిన పనులు ఏమిటంటే..
– ఏకాదశి రోజున విష్ణుమూర్తిశంఖాన్ని ఆవుపాలతో శుద్ధిచేసి గంగాజలంతో స్నానం చేయించాలి. దీనివలన డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
– ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించే సమయంలో ” ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ” అనే మంత్రాన్ని జపించండి.
– శ్రీమహావిష్ణువుని పూజించేటప్పుడు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి తులసి దళాలు వేసిన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టండి.