Bhogi : భోగి పండుగ రోజు ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారా… జీవితంలో సమస్యలు తప్పవు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bhogi : భోగి పండుగ రోజు ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారా… జీవితంలో సమస్యలు తప్పవు…?

 Authored By ramu | The Telugu News | Updated on :13 January 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Bhogi : భోగి పండుగ రోజు ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారా... జీవితంలో సమస్యలు తప్పవు...?

Bhogi  : ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు పండగ అయిన సంక్రాంతి sankranti , భోగి Bhogi  , కనుమ Kanuma  తెలుగు రాష్ట్రాలైన Andhra pradesh  ఆంధ్రప్రదేశ్, Telangana తెలంగాణలో ప్రసిద్ధ పండుగ సంక్రాంతి. భోగి,కనుమ. వీటిని మన తెలుగు వారు చాలా సాంప్రదాయ బద్ధకంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగలో భోగి పండుగ నాడు ఉదయాన్నే లేచి భోగి మంటలను వేస్తారు. భోగిమంటల రోజున మంటల్లో పాత వస్తువులను వేయడమే కాకుండా దాని వెనుక సాంప్రదాయంతో పాటు శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంది. ఈరోజు దక్షిణాయనం చివరి రోజు. ఈరోజు నా భోగి మంటలు వేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది పొరపాటున కూడా ఈ తప్పులను చేయవద్దు. హిందూ ప్రజలు అందరూ కూడా ప్రతి సంవత్సరం భోగి పండుగను సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందున జరుపుకుంటారు. ఏడాది జనవరి 13న భోగి పండుగ వచ్చింది. మకర సంక్రాంతి జనవరి 14న జరుపుకుంటారు. ఈ ఏడాది భోగి పండుగ పుష్య మాసం పౌర్ణమి రోజున వచ్చింది. ఈరోజు ఉదయం భోగి మంటలను వేసి.. సాయంత్రం పూజలు చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 05:34 నుంచి రాత్రి 08:12 వరకు పూజలు చేయడానికి మంచి సమయం. ఈ సమయంలో కుటుంబంతో కలిసి సూర్య భగవానుడు, అగ్ని దేవుడు, దుర్గాదేవి,శ్రీకృష్ణ భగవానుని పూజించవచ్చు.

Bhogi భోగి పండుగ రోజు ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారా జీవితంలో సమస్యలు తప్పవు

Bhogi : భోగి పండుగ రోజు ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారా… జీవితంలో సమస్యలు తప్పవు…?

Bhogi  భోగి పండుగ రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు

భోగి మంటల్లో చెత్త లేదా ప్లాస్టిక్ వెయ్యవద్దు : అగ్నిని పవిత్రంగా భావిస్తాం. అటువంటి అగ్గిలో భోగి రోజున వేసే మంటలను హోమం అంత పవిత్రంగా వేయాలి. కనుక భోగి మంటల్లో చెత్త లేదా ప్లాస్టిక్ వస్తువులు వేయడం అశుభము.

కిరోసిన్ తో మంటలు వెలిగించవద్దు : భోగిమంటల సమయంలో కర్పూరం, నెయ్యి వేసి మంటలను వెలిగించాలి, అంతేకానీ కిరోసిన్ పెట్రోల్ వంటివి వేసి వెలిగించవద్దు.

ఇంకా పాదరక్షకులు చెప్పులు ధరించి భోగి మంటలు ప్రదక్షిణ చేయవద్దు : భోగి మంటలు చుట్టూ చెప్పులు లేకోకుండా ప్రదక్షిణ చేస్తూ తిరగాలి. చెప్పులు, బూట్లు ధరించి ప్రదక్షణ చేయడం ప్రతికూల శక్తి ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

ఎంగిలి చేసిన ప్రసాదాన్ని అగ్నిలో వేయవద్దు : అగ్నిలో స్వచ్ఛమైన ప్రసాదాన్ని మాత్రమే వేయాలి. ఎంగిలి చేసిన ఆహారాన్ని భోగి మంటలు వేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
ఎవ్వరిని అవమానించవద్దు : భోగి రోజున ఎవ్వరిని కూడా అవమానించవద్దు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయి.

ఎవర్ని నొప్పించవద్దు : భోగి రోజున ఎవ్వరిని నొప్పించకూడదు. నా చేయటం వల్ల దేవతలకు కోపం వస్తుంది.

పిల్లలను భోగిమంటల దగ్గర ఒంటరిగా వదిలిపెట్టొద్దు: భోగి మంటలు దగ్గరకు వెళ్లే పిల్లలందరిని ఎల్లప్పుడూ పెద్దల పర్యవేక్షణలో ఉంచండి. పిల్లలను అగ్ని దగ్గర ఒంటరిగా ఉంచొద్దు.

భోగి రోజున ఏం చేయాలంటే : నువ్వులు, బెల్లం, వేరుశనగలు అగ్నిలో వేయండి : నువ్వులు బెల్లం వేరుశనగలను భోగిమంటలకు సమర్పించడం వల్ల, ఆనందం ఐశ్వర్యం కలుగుతాయి.

పేదలకు దానం : భోగి రోజున పేదలకు దానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది.
కుటుంబీకులతో వీలైనంతవర కు సమయం గడపండి : కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ ఆనందంగా జరుపుకోండి.

భోగి ప్రాముఖ్యత: భోగి పండుగ భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగం. పండుగ ప్రకృతిలో మనిషిని అనుబంధాన్ని వ్యవసాయ ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. ఈ పండుగల సందర్భంలో భోగి పండుగ ఒక్కొక్కరు కలిసి ఆనందాన్ని పంచుకోవాలని నేర్పిస్తుంది. ఈ భోగి పండుగ కొత్తగా వేసిన పంటలను ఇంటికి వచ్చే సమయంగా సూచిస్తుంది. ఈ భోగి మంటల్లో తమ దుర్గనాలను ఉదయించేలా చేయడం వల్ల దుష్ట శక్తులు నాశనం అవుతాయని నమ్మకం. భోగి పండుగ ఆనందం సంతోషానికి చిహ్నం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది