Bhogi Festival : సంక్రాంతి పండుగ Sankranti Festival అంటే మూడు రోజుల పండుగ. ఇందులో తొలి రోజున Bhogi pallu భోగి పండుగ జరుపుకుంటాం. భగ అనే పదం నుంచి భోగి అనే మాట వచ్చింది. భగ అంటే వేడి లేదా మంట పుట్టించడం అన్నమాట.. దక్షిణ నాయనకి ఆఖరి రోజు భోగి దక్షిణాయునంలో తాము ఎదుర్కొన్న కష్టాలు బాధలను భోగిమంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణం లో సుఖసంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు. భోగి పండుగ మనలోని ఆశావా దృక్పథానికి సంకేతం. భోగి రోజున తెల్లవారక ముందే లేచి భోగి మంటలు వేస్తారు.ఆవు పేడ, పిడకలు, మామిడి, రావి ,మేడి వంటి చెట్ల అవశేషాలు.. తాటాకులు అప్పటికే కోసిన పంటల ఎండు అవశేషాలు వేసి రాజేసే ఈ మంటల్లో ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారే గొప్పగా పరిగణిస్తారు. పనికిరాని చెడు పాత ఆలోచనలు వదిలించుకొని కాలంతోపాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును సిద్ధం చేయడమే భోగిమంట పరమార్ధం. భోగిమంటలు పూర్తికాగానే తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్దన చేసుకుని కుంకుడుకాయ రసంతో తల స్నానం చేయాలి. ఇది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేయాలి. దీని వల్ల చలి వాతావరణ కారణంగా ఒంట్లో చేరిన కఫ, దోషాలు తొలగిపోయి శరీరం నూతన ఉత్తేజానికి పొందుతుంది. ఇలా చేసే స్నానం పీడను దరిద్రాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం.
బోగినాడు కొత్త బియ్యంతో చేసిన పులగం తినడం సంప్రదాయం పేసరపప్పు, నెయ్యి, మిరియాలు జోడించి చేసే ఈ వంటకం రుచిగాక పోషకాల పరంగాను ఎంతో మేలు అయింది.చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపించే ఈ పులగాన్ని బోగినాడు తప్పక తినాలని పెద్దలు చెప్తారు. పొగినాటి సాయంత్రం చిన్న పిల్లల బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువులో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను క్రమ పద్ధతిలో ప్రదర్శనగా ఉంచి పూజిస్తారు. ఈ సందర్భంగా ఆయా దేవి దేవతల పాటలు పాడి వారి ఆశీస్సులు కోరుకుంటారు.కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర నీరుపారించి తడిచేస్తారు. ఒక పంట పూర్తయిన తదుపరి మళ్లీ పంట కొరకు సాగు భూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు..
బోగి పండ్లు bhogi pallu decoration : భోగి రోజు రేగి పండ్లను భోగి పండ్లుగా పిల్లలపై పోస్తారు. ఈ విధంగా పోస్తారు కాబట్టి వీటిని భోగి పళ్ళు అంటారు. ఇలా భోగి రోజు భోగి పళ్ళు పిల్లలపై ఎందుకు పోస్తారో చాలామందికి తెలియదు. అలా పోయటం వెనుక పరమార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రేగి పళ్ళను బదరీ ఫలాలు అంటారు. అక్కడి శ్రీ మహావిష్ణువు వనంలో బదరీ ఫలాలు అయినటువంటి పండ్లను తిన్నారని తింటూ ఆ వృక్షాలను తాకుతూ ఆశీర్వదించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణ ఆశీస్సులు పొందాయి. కాబట్టి ఈ పండ్లు ఎవరు ఏ విధంగా వాడిన సిరి సంపదలు మరియు భోగభాగ్యాలతో తుల తుగుతారని హిందువులు నమ్మకం. భోగి రోజు పెద్దవారు చిన్న పిల్లలపై భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు ఆశీర్వాదం తమ పిల్లలపై ఉండి పిల్లలు భోగభాగ్యాలతో సిరిసంపదలతో తులతుకుతారని గట్టిగా నమ్ముతారు. అంతేకాదు ఈరోజు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఇలా చేస్తే వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుందని హిందువులు నమ్ముతారు. అంతేకాదు అంటే ఈరోజు రేగిపండ్లను పిల్లలపై పోస్తే ఆ సూర్యభగవానుడి అనుగ్రహం పిల్లలపై ప్రసరించి కలకాలం ఆరోగ్యంగా జీవిస్తారని నమ్ముతారు.
భోగి రోజు సాయంత్రం ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు కొత్త బట్టలు నగలతో ముస్తాబు చేసి కుర్చీలో లేదా బలపై వారి వారి స్తోమతను బట్టి కూర్చోబెట్టి భోగి పేరంటం ఏర్పాటు చేస్తారు. అంటే ఇంటి చుట్టుప్రక్కల వారిని బొట్టు పెట్టి రమ్మని పిలిచి తరువాత ఒక పళ్ళెంలో రేగిపళ్ళు నానబెట్టిన సెనగలు, చిల్లర నాణాలు, పూలు కలిపి భోగి పళ్ళు ఉంచుతారు. మరొక పళ్ళెంలో బియ్యం లో పసుపు కలిపి అక్షతలు ఉంచుతారు. తమ పిల్లలపై భోగి పళ్ళు పోసి కర్పూర హారతి ఇచ్చి ఆక్షతలు పిల్లల తలపై వేసి ఆశీర్వదిస్తారు. తరువాత ఇంటికి వచ్చిన వారికి తాంబూలం ఇచ్చి పంపుతారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇలా చేయటం వల్ల తమ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. చెడు సావాసాలు, వ్యసనాలకు గురికాకుండా బుద్ధిమంతులుగా ఎదిగి సమాజంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ విధంగా ఎదగాలని సమస్త దేవతలు మరియు శ్రీ మహా విష్ణువు ఆశీర్వాదం కలగాలని భోగి పళ్ళు పోస్తారు. ఇదే సంక్రాంతి సమయంలో భోగి రోజు భోగిపండ్లు పోయటం వెనుక ఉన్న పరమార్ధం..
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.