Sankranti Festival : అసలు సంక్రాంతి అంటే ఏమిటి..? సంక్రాంతి పండగ ప్రాముఖ్యత ఏమిటి..?
ప్రధానాంశాలు:
Sankranti Festival : అసలు సంక్రాంతి అంటే ఏమిటి..? సంక్రాంతి పండగ ప్రాముఖ్యత ఏమిటి..?
Sankranti Festival : సంక్రాంతి Sankranti అంటే ఏమిటో తెలుసుకుందాం.. అలాగే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత గురించి మరియు సంక్రాంతి పండుగ రోజు ఏ ఏ పనులు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సూర్యుడు 12 రాశుల గుండా ప్రయాణించడం ప్రకారం మేషం ,వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్యా,తుల, వృచికం ,ధనస్సు, మకరం, మీనం అనే 12 రాశుల గుండా సూర్యుడు ప్రయాణిస్తాడని చెబుతారు. కానీ నిజానికి భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. భూమిని 12 భాగాలు చేశారని ఆ 12 బాగాలే 12 రాశులని ఇంకా ఒక రాశి నుండి మరొక రాసికి మారిన ప్రతీసారి ఒక సంక్రాంతి అని అర్థం. అలాగే మకర రాశిలోకి సూర్యుడు చేరిన రోజున ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఎందుకంటే అప్పటివరకు భూమి దక్షిణం వైపు ప్రయాణించే సూర్యుడు ఉత్తరం వైపుగా ప్రయాణించడం ప్రారంభిస్తాడు. ఇంకా రాత్రి వరకు నిద్రించిన దేవతలు సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళగానే మేలుకుంటారు. అంటే వారికి పగలు వస్తుంది. అలాగే స్వర్గపు ద్వారాలు తెరుచుకోగానే దేవతల రోజు వస్తుంది. కాబట్టి పుణ్యకాలం మొదలవుతుంది. కొన్ని కోట్ల ప్రజల మనసులోకి భావన కలిగించేవి సంక్రాంతి పండుగ. ఈ పండుగను మూడు రోజుల జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండగ ఆనంద ఉత్సాహాలతో పిండి వంటలతో విందు చేసుకునే పండుగ.
మకర సంక్రాంతికి makar sankranti ముందు రోజున భోగి పండుగ bhogi muggulu వస్తుంది. భోగి అంటే బోగించడం, సుఖపడటం అంటే అన్ని రకాల పంటలు కోతలు పూర్తయి ధాన్యం ఇంటికి చేరి అమ్మకం జరిగి డబ్బులు చేతికి వస్తాయి. అహంకరించే మనసుల నుండి పుట్టిన అసహ్యమైన శారీరకమైన కోరికలను కాల్చి పరమాత్ముడిని గుర్తించడం అసలైన సత్యమని తెలిపేందుకే భోగి మంటలను పెడతారని ఆధ్యాత్మిక వాదులు చెబుతారు. అలాగే సంక్రాంతి రోజున చలి ఎక్కువగా ఉంటుందని భోగి మంటలు పెడతారు. ఇంకా ఇంట్లో ఉన్న పనికిరాని కర్ర సామను తీసుకొచ్చి భోగి మంటలో వేస్తారు. ఎందుకంటే ఈ కర్ర సామానుని సంక్రాంతి తర్వాత ఇంట్లో ఉంచుకోవడం దరిద్రంగా భావిస్తారు. ఇక భోగి రోజున పిల్లలకు రేగు పళ్ళు తల మీద నుండి కింద పడేలా ధారగా పోస్తారు. ఇలా చేస్తే పిల్లలకి పట్టిన పీడలు పోతాయి అని భావిస్తారు. ఈ పిండి చీమలకు కీటకాలకు ఆహారంగా పనిచేస్తుంది. ఇంకా ఈ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, బంతి పూలు పెట్టి నవధాన్యాలు పోస్తారు. గొబ్బెమ్మని గోదాదేవిగా భావిస్తారు. ఆరోజు సాయంత్రం బొమ్మలతో కొలువు తీరుస్తారు. తర్వాత వచ్చిన సూర్యుడు దక్షిణాయామం నుండి ఉత్తరాయణం వైపు చేరుతాడు.
అప్పుడు మకర రాశి ప్రారంభమవుతుంది. అప్పుడే మకర సంక్రాంతి వస్తుంది. ఈ మకర సంక్రాంతి Sankranti రోజు నుండి దేవతలకు పగలు ఇంకా స్వర్గపు ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. అలాగే దక్షిణాయన కాలంలో చనిపోయిన వారి ఆత్మ శాంతి కలగాలని పుణ్యతీర్థాలలో స్నానం చేసి తర్పణాలు వదులుతారు. ఈ రోజంతా ఆకాశంలోని దేవతలు సంతోష పడేలా ఆకాశం నిండా రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ పిల్లలు హంగామా చేస్తారు. ఇంకా గంగిరెద్దుల వాళ్ళు ఎద్దులను అందంగా తయారు చేసి తీసుకొస్తారు. ఇంకో పండుగ మూడో రోజున కనుమ పండుగ అంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి నాలుగవ రోజుగా మొక్కలు అని కూడా చేసుకుంటారు. ఆరోజు సంక్రాంతి పురుషుని బొమ్మని ఆడిస్తారు. అలాగే సంక్రాంతి పండుగకు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే అన్ని పండుగలు వేరే వేరే నెలలో వేరే వేరే తేదీలలో వస్తే సంక్రాంతి పండుగ మాత్రం ప్రతి సంవత్సరం ప్రతి నెల జనవరిలోనే వస్తుంది. అలాగే సంక్రాంతి పండుగ కూడా సౌర గమనాన్ని అనుసరించి వస్తుంది. అందుకే ప్రతిసారి ఈ సంక్రాంతి పండుగ ఒకే నెలలో వస్తుంది..