Chanakya Niti : చాణక్యుడు చెప్పిన ఈ నాలుగు సూత్రాలు పాటిస్తే చాలు.. మీరు ఏదైనా సాధిస్తారట..?
Chanakya Niti : చాణక్యుడు తెలివి తేటలు అసాధారణం. ఎంతో ప్రతిభావంతుడు. సమర్ధుడైన రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త అని పిలుస్తుంటారు. ఆయనకు అనేక విషయాలపై పట్టు ఉంది. తన అనుభవాలను అనేక శాస్త్రాల్లో పొందుపరిచాడు. తన జ్ఞానాన్ని ఉపయోగించడంలో గొప్ప పండితుడు గనుకే అతన్ని కౌటిల్య అని పిలుస్తుంటారు. చాణుక్యుడు రచించిన ‘నీతి శాస్త్రం’ నేటి మానవులకు అనేక జీవన మార్గాలను సూచిస్తోంది. వాటిని ఆచరిస్తే చాలు. మనిషి తన జీవితంలో కన్న కలలు నేరవేరుతాయి. ఏ కలతలు, కష్టాలు లేకుండా వారి జీవితం సాఫీగా సాగిపోతుందట. నేడు ప్రతీ మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. అయితే, ఏది తప్పు, ఏది ఒప్పు అనే తేడాను గుర్తించలేకపోతున్నాడని తెలుస్తోంది. అలా తప్పు ఒప్పుల మధ్య తేడాను గుర్తించడానికి చాణక్య నీతిలో రచించిన 4 విషయాలు మీకు సహాయపడతానుకుంట..
అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..మొదటిది ఎవరికైనా దుఃఖం కలిగితే ఇంకొకరితో పంచుకుంటే తగ్గుతుందని అంటున్నారు కొందరు. కానీ చాణక్యుడు మాత్రం ఎవరితోనూ పంచుకోకూడదని చెప్పాడు. ఎందుకంటే మీ బాధలను ఎవరూ తగ్గించలేరు. బదులుగా అవతలి వారు అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. కొందారు మిమ్మల్ని ఓదార్చుతారు. కానీ, అప్పుడు కూడా మీ బాధ పోదు. మీ బాధల ప్రభావం ఇతరులపై ఎప్పుడూ ఉండదు. కావున మీ బాధలు, దుఃఖాన్ని మీకే పరిమితం చేసుకోండి. రెండవది భార్యాభర్తల బంధం ప్రేమతో ఉండాలి.ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇద్దరూ ఒకరికొకరు పూర్తిగా మద్దతునివ్వాలి. మీ జీవిత భాగస్వామి కోపంగా కనిపించినా, సరిగ్గా ఉండకపోయినా, ముఖంలో ద్వేషపూరిత భావన కనిపిస్తే జీవిత భాగస్వామిని పొందిన కుటుంబంలో ఎప్పుడూ ఎడబాటు, దుఃఖం, బాధలతో నిండి ఉంటుంది. అటువంటి భాగస్వామి మీ పురోగతికి అడ్డింకిగా మారుతుంది. అలాంటి బంధానికి దూరంగా ఉండటమే బెటర్.
Chanakya Niti: చాణక్య నీతి సూత్రాలు..
మూడవది తన కుటుంబం గురించి బయటి వ్యక్తులతో ఏమీ చెప్పుకోకూడదని చాణ్యకుడు నమ్మాడు. కొందరు తమ ఇంట్లోని రహస్యాలను బయట వ్యక్తులతో పంచుకుంటుంటారు. దీనివలన అవకాశం ఉన్నప్పుడు బయటి వ్యక్తులు మీ ఇంట్లో సమస్యలు ఇంకా రెట్టింపు కావడానికి ప్రయత్నిస్తారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటారు. నాలుగవది ఓ వ్యక్తి చేసే పని సమాజంలో అతని గౌరవాన్ని, కీర్తిని పెంచతుంది. గౌరవం అనేది అతని ఆభరణం. మంచి పనులు చేయడం వల్లే ఆభరణం లభిస్తుంది. అదే మనిషి జీవనానికి ఉత్తమ మార్గం అవుతుంది.