Chanakya Niti : ఈ విషయాలను పాటిస్తే… విజయం మీ సొంతం అంటున్న చాణక్య…
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికి ఎంతోమంది అనుసరిస్తున్నారు. ఒక వ్యక్తి ఎటువంటి మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు మొదలగు విషయాలను ఈ నీతి శాస్త్రంలో తెలిపారు. ఆ నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి జీవితాన్ని సులభంగా నడుచుకునే అనేక విషయాలను తెలిపారు. అలాగే ఒక మనిషి విజయం సాధించడానికి అనేక ప్రాథమిక సూత్రాలను కూడా ఆయన తెలిపారు. జీవితంలో విజయం సాధించడానికి ఆచార్య కొన్ని విషయాలను తెలిపారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1) చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఒక మనిషికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అతడు దానిని వదిలి వేయకూడదు. మీరు సోమరిపోతులైతే అవకాశం మీ చేతుల్లో నుండి జారిపోతుంది. మీ ప్రతిభను చూపించలేరు. కనుక అవకాశం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. కనుక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎప్పటికైనా విజయం సొంతమవుతుంది. 2) ప్రశ్నలు అడగటానికి వెనుకాడే వారు చాలామంది ఉంటారు. దీనివలన అలాంటివారు పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. చాలా తప్పులు చేస్తారు. మీరు ప్రశ్నలు అడగటానికి సంకోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు. కాబట్టి ప్రశ్న అడగండి దాని సమాధానం తెలుసుకోండి అని అంటున్నారు చాణిక్య.
3) ఆచార్య చాణక్య చెప్పిన దాని ప్రకారం ఓటమికి భయపడకూడదు. అపజయానికి భయపడి ముందుకు అడుగు వేయని వారు చాలామంది ఉన్నారు. ఓటమి విజయానికి తొలిమెట్టు కనుక ఓటమికి ఎప్పుడు భయపడకండి. 4) ప్రతి వ్యక్తికి తనపై తనకి నమ్మకం ఉండాలి. తనపై నమ్మకం లేకపోతే అతడు ఏ పని చేయలేడు. నేను చేయగలను అనే పట్టుదల నమ్మకం ఉంటే విజయం మీ సొంతం అవుతుంది. కనుక ఈ నాలుగు విషయాలను పాటిస్తే జీవితంలో అన్ని విజయాలను అందుకుంటారు అని చాణక్యులు తెలిపారు.