Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఈ విషయాలు అర్థం చేసుకుంటే జీవితంలో కష్టాలే ఉండవు..
Chanakya Niti : మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటినీ ప్రస్తావించి వాటికి పరిష్కారాలను ఆచార్య చాణక్యుడు తన గ్రంథంలో సూచించారని పెద్దలు చెప్తున్నారు. వాటిని ప్రతీ ఒక్కరు ఫాలో అయితే చాలు.. సమస్యలన్నిటికీ ఇట్టే పరిష్కారం లభిస్తుందని వివరిస్తున్నారు కూడా. ఇకపోతే చాణక్యుడు చెప్పినట్లు జీవితంలో ఈ విషయాలను అవగతం చేసుకుని ముందుకు సాగితే జీవితంలో ఇక ఇబ్బందులే ఉండవని పెద్దలు చెప్తున్నారు.ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు ఈ విషయాలపైన పట్టు సాధిస్తే చాలు.. మీరు అన్ని పనులను ఇట్టే చక్కబెట్టుకోవచ్చును. అవేంటంటే.. తల్లిదండ్రులు, దేవతలు, సాధువులు, గురువులను కంపల్సరీగా గౌరవించాలి.
ఇకపోతే మనిషి చేయబోయే పనులన్నీ సత్కార్యములు అయి ఉండేలా జాగ్రత్త వహించాలి. పనులు సత్కార్యములు అయితే కనుక చక్కటి ఉపయోగాలుంటాయి. కర్మ మనిషిని అనుసరిస్తుంది. కనుక జాగ్రత్తగా పనులు చేయాల్సి ఉంటుంది.వేదాలు, ఇతర మత గ్రంథాలు చదివిన వ్యక్తి కంటే కూడా తన సొంత ఆత్మను గ్రహించకపోతే అతని జ్ఞానం అంతా కూడా వ్యర్థమేనన్న సంగతి గ్రహించాలి. సొంత అనగా ఆత్మ పరిశీలన అనేది చాలా ముఖ్యమన్న సంగతి గ్రహించాలి. ఇకపోతే విజయం సాధించాలంటే ముందర అపజయం లేదా వైఫల్యం రుచి చూసి ఉండాలి.
Chanakya Niti : చాణక్యుడు చెప్పిన విషయాలివే..
అలా అయితేనే మీ లక్ష్యాన్ని మీరు రీచ్ అవుతారు. సంతృప్తి అనేది కూడా జీవితంలో చాలా ముఖ్యం. అది లేకపోతే కనుక జీవితంలో అస్సలు ముందుకు సాగరు. ప్రతీ ఒక్కరు సంతృప్తితో జీవితంలో ముందుకు సాగాల్సి ఉంటుంది. ప్రతీ ఒక్కరు కూడా సంతృప్తితో జీవనం సాగించాలి. అలా అయితేనే వారు జీవితంలో ముందుకు సాగినట్లన్న సంగతి గుర్తెరగాలి. ఈ విషయాలను అవగతం చేసుకుని జీవితంలో ముందుకు సాగినట్లు అయితే వారు జీవితంలో ఎటువంటి కష్టాన్ని అయినా ఇట్టే జయించగలుగుతారు. కాబట్టి ప్రతీ ఒక్కరు ఈ విషయాల పట్ల దృష్టి సారిస్తే చాలా మంచిది.