Chanakya Niti : ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికీ ఎంతోమంది అనుసరిస్తున్నారు. ఆ నీతి శాస్త్రంలో ఒక మనిషి తన జీవితంలో ఎటువంటి మార్గంలో వెళ్లాలి, ఎవరిని నమ్మాలి, శత్రువులను ఎలా గెలవాలి ఇలా అనేక అంశాలపై తన అభిప్రాయాలను ఆచార్య చాణక్యుడు పంచుకున్నారు. వాటిని కనుక అనుసరిస్తే మనం ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుందంట. శత్రువులను గెలవడానికి చాణుక్యుడు ఒక విధానాన్ని పేర్కొన్నారు. దీనిని అర్థం చేసుకొని తద్వారా శత్రువుకు కఠినమైన గుణపాఠం చెప్పవచ్చని అంటున్నారు. అయితే ఇప్పుడు చాణక్యుడు శత్రువులకు ఎలాంటి కఠిన శిక్షను విధించాడు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచార్య చాణుక్యుడు చెప్పిన దాని ప్రకారం శత్రువు ఎంత శక్తివంతుడైన, అతను మీకు బాధను కలిగిస్తుంటే మీరు అతని ముందు సంతోషంగా ఉండాలని చెప్పారు. దీంతో శత్రువుకు తగిన శిక్ష పడుతుందని చాణక్యుడు తెలిపారు. శత్రువుపై విజయం సాధించడానికి ఇదే సరైన మార్గం అని పేర్కొన్నారు. ఇందులో ఆయుధాలు లేదా మిత్రపక్షాలు అవసరం లేదు. ఒంటరిగా సంతోషంగా ఉండడం ద్వారా మీరు మీ శత్రువులకు ఎంతో బాధను కలిగిస్తారు. అది నేరుగా వారి హృదయానికి గుచ్చుకుంటుంది.

అలాగే ఎదుటివారు తన శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి కష్టాల్లో ఉన్న వ్యక్తిని చూడాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. కానీ మీరు అతని ముందు ప్రతి పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తే, అది అతనికి చెంపదెబ్బల మారుతుందని తెలిపారు. దీంతో పాటు నవ్వుతో ప్రతి సమస్యను పరిష్కరించడం కూడా సులభం అవుతుంది. ఎందుకంటే ఇది శత్రువుని నిరుత్సాహపరుస్తుంది. ఇది అతనికి ఒక పెద్ద శిక్ష అవుతుందని అన్నారు. ఒక మనిషి తన సన్నిహితులను శిక్షించలేడు. ఎందుకంటే వారు హృదయానికి చాలా దగ్గరగా ఉంటారు. అలాంటి సందర్భాలలో గుణ పాఠం చెప్పాలనుకుంటే లేదా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మీ మానసిక స్థితిని ఎల్లప్పుడూ అతని ముందు సంతోషంగా ఉంచాలి. ఇలా చేయడం ద్వారా అతనికి జీవిత ఖైదీ శిక్ష విధించవచ్చని ఆచార్య చాణుక్యులు తన నీతి శాస్త్రంలో తెలిపారు.