Chanakya Niti : గత జన్మలో చేసిన పుణ్యం వలనే, ఈ జన్మలో ఈ 5 సుఖాలను పొందగలుగుతారు…
Chanakya Niti : చాణక్య నీతి ఒక మనిషి తన గత జన్మలో చేసిన కర్మల మీదనే ఈ జన్మ ఆధారపడి ఉంటుందని ఆచార్య చాణక్యుడు తను రచించిన నీతి శాస్ర్తంలో తెలిపారు. అయితే ఒక వ్యక్తి గత జన్మలో చేసిన పుణ్యాల వలన ఈ జన్మలో కొన్ని సుఖాలను పొందగలుగుతాడంట. అలాగే గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో అనేక బాధలను అనుభవిస్తాడంట. ఇలా అందరికి ఒకలా జరగదు.ఒక్కొక్కరికి ఒక్కో తీరుగా జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు మంచి మార్గంలో వెళ్లాలి, చెడు మార్గంలో వెళితే ఈ జన్మలో కాకపోయిన వచ్చే జన్మలో అయిన తప్పక బాధలను అనుభవిస్తారని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు.గత జన్మలో చేసిన పుణ్యాల వలన ఈ జన్మలో ఈ 5 సుఖాలను పొందుతారంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
1)గత జన్మలో చేసిన పుణ్యాల వలన ఈ జన్మలో దానధర్మాలు చేసే గుణం వస్తుంది. ఇలా దానధర్మాలు చేయడం కొందరికే సాధ్యం. కొందరు తమ వద్ద ఎంత ధనం ఉన్నా ఇరువురికి సహాయం చేయరు. కొందరు తమకు దానం చేసే స్తోమత లేకపోయిన తమకు ఉన్న దాంట్లోనే ఇరువురికి సహాయం చేస్తారు. ఒకరికి సహాయం చేస్తే మనకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మన వలన ఒకరి జీవితం బాగుంటుందంటే దానికి మించిన సంతోషం ఉండదు. అలాగే గత జన్మలో దానం చేయడం వలనే ఈ జన్మలో వాళ్లకు దానం చేయాలనే స్వభావం వస్తుందంట.
2) ప్రతి ఒక్కరికి ఒక గొప్ప సంతోషం ఏమిటంటే సరైనా జీవిత భాగస్వామి దొరకడం. జీవిత భాగస్వామి గుణవంతులు, తెలివైనవారు అయితే వీరు చాలా అదృష్టవంతులు. గత జన్మలో చేసిన కర్మల వలనే ఈ జన్మలో సద్గుణవంతులైన జీవిత భాగస్వామిని పొందగలుగుతారు. అలాగే ఇరువురి జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయి. అలాగే గత జన్మలో స్ర్తీలను అవమానించినవారు ఈ జన్మలో వారి వైవాహిక జీవితం చాలా కష్టాలతో సాగుతుందంట.కనుక స్ర్తీలను గౌరవించాలి. స్ర్తీలను అవమానిస్తే ఆ పాపం ప్రతి జన్మలో వెంటాడుతుంది.
3)చాలామందికి తినే ఆహారం మంచిగా లభించదు. అదృష్టవంతులు మాత్రమే మంచి ఆహారాన్ని పొందగలుగుతారు. మంచి ఆహారాన్ని సేవించడం ఒక అదృష్టం. మీకు ఏ సమయంలో ఏది తినాలనిపిస్తే అది తినడం, దీనికి మించిన సంతోషం, తృప్తి ఇంకొకటి ఉండదు. అలాగే కడుపు నిండా ఆహారం తింటే దానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. గత జన్మలో చేసిన పుణ్యాల వలన ఈ జన్మలో ఈ సుఖాన్ని పొందగలుగుతారు.
4) అలాగే మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యే శక్తి ఉండాలి. తినగానే సరిపోదు, తిన్నది అరగటం కూడా అదృష్టమే. చాలాసార్లు మనకు మంచి ఆహారం లభిస్తుంది. కానీ జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం వలన తినాలనుకునేవి తినలేకపోతున్నాం. దీనితో పాటు తిన్నది అరగక పోతే వివిధ రకాల రోగాల బారిన పడుతాం. అందువలన తిన్న ఆహారం మంచిగా జీర్ణమయ్యే సామర్థ్యం ఉన్నవారు అదృష్టవంతులు.
5) ఒక వ్యక్తి ధనవంతుడు అయినంత మాత్రాన సరిపోదు. డబ్బును ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి. డబ్బును మంచి పనులు చేయడానికి ఉపయోగించాలి. చెడు పనులకు ఉపయోగించరాదు. డబ్బు లేని పేదవారికి ఆర్ధికంగా సహాయం చేయాలి. గత జన్మలో చేసిన కర్మల ఆధారంగానే ఈ గుణాలను పొందడం వీలవుతుంది. ధనవంతుడిగా ఉండడంతో పాటు ధనాన్ని సరిగ్గా ఉపయోగించేవారు కూడా అదృష్టవంతులే.