Chanakya Niti : చాణక్య నీతి జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు ఈ 3 విషయాలను గుర్తించుకోండి…
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రాన్ని రచించిన విషయం అందరికి తెలిసిందే. అలాగే ఆయన రచించిన జీవిత సూత్రాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. ఇందులో జీవితం సుఖసంతోషాలతో ముందుకు సాగేందుకు ఉపయోగకరమైన సూచనలను ఆయన అందించాడు.అలాగే మనిషి జీవితంలోవివాహం అనేది ఒక ముఖ్యమైన దశ. ఆడవారు అయినా,మగవారు అయినా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కొంచెం కష్టమే కానీ మంచి లక్షాణాలను గుర్తించి వివాహం చేసుకోవాలి. లేకపోతే జీవితమంతా నరకమే అవుతుందని అంటారు ఆచార్య చాణక్య. అందువలన జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
- ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం అందాన్ని చూసి వివాహం చేసుకోకూడదు. ఎవరైతే అందాన్ని చూసి భాగస్వామిని ఎంచుకుంటారో అలాంటి వారి జీవితం భవిష్యత్తులో నరకంగా మారుతుంది. భాగస్వామి లక్షణాలు, విద్య, విలువలు గుర్తించి వివాహం చేసుకోవాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాలి. ఇలా చేస్తే జీవితం స్వర్గంలా వుంటుంది.
2) జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఎదుటి వారిలో సహనం, ఓర్పు ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఓపికగా ఎదుర్కోవాలి కనుక. అలాగే మంచిగా మాట్లాడేవారు కుటుంబంలో సుఖసంతోషాలను ఉంచుతారంట.
3) అలాగే ఎవరైనా సరే ఒత్తిడితో వివాహం చేసుకోకూడదు. బలవంతంగా చేసుకున్న వివాహం మీ జీవితంలో ఎటువంటి ప్రేమను, ఆనందాన్ని ఇవ్వదు. జీవితమంతా నరకంగా ఉంటుంది.అలాగే వివాహ సమయంలో ఆచార వ్యవహారాలను పాటించడం ఉత్తమం. జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు ఈ మూడు విషయాలను గుర్తించుకుంటే మీ జీవితం సుఖమయం అవుతుంది.