Chanakya Niti : వీళ్లకి దూరంగా ఉంటే విజయం మీదే అంటున్న చాణక్య…నీతి శాస్త్రంలో ఎన్నో సూచనలు
Chanakya Niti : ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ఎంతో ప్రాచూర్యం పొందింది. అందులో రాసిన ప్రతి అంశం ఇప్పటికీ మానవాళికి ఉపయోగపడుతుంది. ఎవరితో ఎలా ఉండాలి…. ఏవిధమైన జీవన శైలి అలవాటు చేసుకోవాలి. తమ లక్ష్యాలను, విజయాలను ఎలా చేరుకోవాలో తన నీతి శాస్త్రంలో వివరించాడు. అందుకే ఇప్పటికీ ప్రతి ఒక్కరూ చాణక్య నీతిని ఫాలో అవుతుంటారు. ఎలాంటి జీవిన విధానాలను అనుసరించడం ద్వారా వారి జీవితం సంతోషంగా గడుస్తుంది… అలాగే మానవులలోని చెడుగుణాలను కూడా వివరించాడు. కొన్ని అలవాట్లకు, కొందరు మనుషులకు దూరంగా ఉంటే మంచిదని చెప్పాడు.
అయితే జీవితంలో విజయం సాధించాలంటే ఈ ఐదు నియయాలను పాటించాలని సూచించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..ఆచార్య చాణక్య తన నీతిశాస్త్రంలో జ్ఞానం లేని గురువుని అనుసరించవద్దని సూచించాడు. అలాంటి గురువుకి దూరంగా ఉండాలని, తన మతం, బాధ్యతపట్ల అవగాహన లేని గురువు పక్కన ఉండటం వల్ల జీవితంలో ఏమి సాధించలేమని చెప్పాడు. అలాగే జీవితంలో ఇలాంట గురువుని నమ్ముకుంటే ఎలాంటి వృద్ధి సాదించలేమని సూచించాడు.అలాగే దయ.. మానవత్వంలేని మాతాన్ని విడనాడాలని చెప్పాడు. మనం పాటించే మతం ఎదుటి వారిపై దయ కరుణ చూపకపోతే అలాంటి మతాన్ని పాటించాల్సిన అవసరం లేదన్నాడు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయలేని మతానికి దూరంగా ఉండాలని సూచించాడు.

Chanakya Niti Success Eyes Yours If You Stay Away From Them
భక్తి మార్గమే ముఖ్యం కాదని మానవత్వాన్ని కూడా చూపించే మతాన్ని పాటించాలని చెప్పాడు.అలాగే చాణక్య నీతిలో చెడుసావాసాలకు దూరంగా ఉండాలని చెప్పాడు. చెడు వ్యసనాలు ఉన్న వ్యక్తితో స్నేహం చూస్తే మనం కూడా అదే దారిలో వెళ్తామని.. అటువంటి వాళ్లను దూరంగా పెట్టాలని తెలిపాడు. ఇలాంటి స్నేహం వల్ల జీవితంలో ఏం సాధించలేమని.. ఇది తమ భవిష్యత్తును నాశనం చేస్తుందిని సూచించాడు.అంతేకాకుండా బంధువుల్లో కూడా చాలా మంది స్వార్థపరులు ఉంటారని.. వాళ్లు వాళ్ల అవసర నిమిత్తం ఏమైనా చేయడానికి సిద్దపడతారని అలాంటి వారిని కూడా దూరం పెట్టాలని చెప్పాడు. స్వార్థపరులు మనకు కొంత సాయం చేసి ఎంతైనా ఆశిస్తారని.. వాళ్లతో పెద్దగా ప్రయోజనం ఉండదని సూచించారు.