Chanakya Niti : జీవితంలో ఈ నాలుగు విషయాలు చాలా ముఖ్యమైనవి… ఆచార్య తెలియజేసిన ఆ విషయాలు ఏమిటంటే…
Chanakya Niti : ఆచార్య నీతి శాస్త్రం ప్రకారం గా జీవితం గురించి ఎన్నో సత్యాలను చెప్పడం జరిగింది. అలాగే మనిషి జీవితంలో ఎటువంటి విషయాలు ముఖ్యమైనవి కూడా ఇప్పుడు తెలియజేయడం జరిగింది. అనుబంధాలు, వ్యాపారం, విద్య, ఉద్యోగానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆచార్య ప్రస్తావించారు. మనిషి జీవితంలో విజయాన్ని అందుకోవాలంటే పాటించాల్సిన కొన్ని మార్గాలు కూడా ఆచార్య తెలియజేశారు… అవేంటో ఇప్పుడు చూద్దాం…
మోక్షం… ఆచార్య తెలియజేసిన ప్రకారంగా మంచి పనులు చేసేవాళ్లు మోక్షాన్ని అందుకుంటారు. కావున వీలైనంతవరకు మంచి పనులను చేయాలని ప్రస్తావించారు. కర్మ ఫలాన్ని లక్ష్యాన్ని అందుకున్న తర్వాత చివరి క్షణంలో మోక్షాన్ని అందుకుంటారు. మతం… మనిషి తన సంప్రదాయాలను మతపరమైన నియమాలను తప్పక పాటించాలి. మతం ఒక మనిషి జీవితంలో సరియైన దారిని చూపిస్తుంది. మనిషి చేసిన ప్రతి పనిలో విజయం అందుకోవడానికి సాధనంగా రూపొందుతుంది.
ధనం… జీవితంలో ఆనందం అందుకోవడం కోసం ధనం చాలా అవసరం. అది మనీ అవసరాలను తీరుస్తుంది. కష్టమొచ్చిన టైం లో ఆ ధనం చాలా సహాయపడుతుంది. ధనం సంపాదించడానికి ఒక లక్ష్యం కూడా చాలా అవసరం. ఇది మనిషి ఆర్థిక స్థితిని పురోగతిని పెంచుతుంది. పని… ఎంతోమంది బద్ధకంతో వారి జీవితాలను వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటివాళ్లు కుటుంబ పరువును, పేరును చెడగొడుతూ ఉంటారు. మనిషి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఇది సమాజంలో వారి పేరు ప్రఖ్యాతులను మెరుగుపరుస్తుంది. ఇటువంటివారు కుటుంబానికి కూడా అండగా నిలబడతారు.