Chanakya Niti : ఇవి పాటిస్తే కష్టాలన్నీ పరార్…. ఈ విషయంలో చాణక్య నీతి ఏం చెబుతుదంటే..
Chanakya Niti : ఆచార్య చాణక్య రచించిన చాణక్య నీతి ఎన్నో విషయాలను మానవాళికి చెప్తోంది. మనుషులు ఎలా నడుచుకోవాలి.. విజయాలు సాధించడానికి ఏం చేయాలి.. ఎవరితో ఎలా ఉండాలి. వేటికి దూరంగా ఉండాలి. ఎవరికి ఎందుకు దూరంగా ఉండాలి అనే అంశాలపై చణక్య తన నీతి శాస్త్రంలో వివరించాడు. చాణక్య నీతి అందరికీ అనుసరణీయం. అందుకే ఇప్పటికీ యువత మొదలు ప్రతిఒక్కరూ చాణక్య చెప్పిన జీవిత సూత్రాలు పాటిస్తున్నారు. చాణక్య తన అనుభవాలతో మనుషుల స్వాభావాల గురించి ఎప్పుడో చాణక్య నీతిలో పొందుపర్చాడు. మనుషుల స్వార్థం.. కపట ప్రేమ, కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఎదుగుదల వంటి అనేక అంశాలపై చెప్పాడు.
ప్రస్తుతం చాణక్య కష్టాలను ఎదుర్కోవడానికి ఏం చెప్పాడో తెలుసుకుందాం…ప్రతి ఒక్కరూ తమ చూపుని ముందుకు వెళ్లేటప్పుడు నేలపై ఉంచాలని సూచించాడు. ఎందుకంటే దారిలో ఎన్నో అవరోధాలు ఉంటాయి. వాటిని దాటుకుని ముందడుగు వేయాలంటే ముందుచూపు తస్పనిసరి. లేదంటే అన్నివిధాలుగా నష్టపోతారు అని చెప్పాడు. ఇది మనుషులకు ఎంతో ముఖ్యం.అయితే మనసు స్థిరంగా లేనివారు ఒక మాట నిలబడలేరు. స్పష్టంగా మాట్లాడలేరు.. ఏదో ఒకటి మాట్లాడుతూ నమ్మకం కోల్పోతారు. ఒంటరిగా మిగిలిపోతారు. మనసు స్థిరంగా ఉంటే అది ఏదైనా జరగనీయండి.. కానీ మనకంటూ ఓ గుర్తింపు ఉంటుంది. లేదంటే జీవితంలో స్థిరత్వం అంటూ లేకుండా పోతుంది.

chanakya niti you remember These 5 things can stop big troubles in life
అలాగే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని చాణక్యుడు సూచించాడు. శరీరం శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలమని చెప్పాడు. ఇందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలని, మనం ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని తెలిపాడు. అయితే ఏ పని చేసినా మనస్పూర్తిగా చేయాలని నిండుమనసుతో చేస్తే ఎదైనా సాధించవచ్చని తన చాణక్య నీతిలో వివరించాడు. ఒక్క సారి సరైన నిర్ణయం తీసుకుంటే ఇక తడబడకుండా ముందుకు వెళ్లాలని సూచించాడు.అయితే అబద్దాలు చెప్పే వ్యక్తులు కష్టాలపాలవుతారని చెప్పాడు. అబద్దాలు చెప్పకుంటూ పోతే జీవితమే ఒక అబద్దం అవుతుందిని.. మనకు ఎవరూ విలువ ఇవ్వరని తెలిపాడు. ఒక్క అబద్దం వంద అబద్దాలు ఆడేలా చేస్తుదిని అందుకే ఏదైనా సరే నిజమే మాట్లాడాలని సూచించాడు.