Chanakya Niti : లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. ఈ విషయాలను తెలుసుకోవాలి అని అంటున్న చాణక్య..
Chanakya Niti : చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన గొప్ప విద్యావేత్త. బుద్ధిబలం కలవాడు. ఒక రాజ్యాన్నే ఏలగల సమర్ధుడు. ఈయన రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికీ ఎంతోమంది అనుసరిస్తారు. ఈ నీతి శాస్త్రంలో ఒక మనిషి తన జీవితంలో ఎటువంటి మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి ఆలోచనలను తీసుకోవాలి అని మొదలగు విషయాలు ఉంటాయి. ఈ నీతి శాస్త్రం ఇప్పటి వారికి ఎంతో స్ఫూర్తిదాయకం.ఈ శాస్త్రాన్ని కనుక అనుసరిస్తే జీవితం సుఖమయం అవుతుంది అని చాణక్యుడు తెలిపారు. ముఖ్యంగా కొన్ని విషయాలలో మనిషి జాగ్రత్తగా ఉండాలి అని, అలా ఉంటేనే కొన్ని పనులు విజయం అవుతాయని, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చాణక్యులు తెలిపారు.
విద్య, వివేకం, శ్రద్ధ అనేది జీవితంలో విజయానికి మూడు ప్రధాన సూత్రాలు. ఈ మూడు గుణాలు ఉన్న వ్యక్తి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని ఆచార్య చాణుక్యుడు నీతి శాస్త్రంలో వివరించారు. ఇవి జీవితంలో ఎదురయ్యే అనేక అడ్డంకులను తొలగిస్తాయి. ఎవరైనా సరే ఎప్పుడైనా ఉద్రేకంతో లేదా అపరిమిత ఉత్సాహంతో ఏ పని చేయకూడదు. ఎందుకంటే అటువంటి స్థితిలో మనస్సాక్షి లోపిస్తే వైఫల్యానికి దారి తీస్తుంది. తెలివిగా పనిచేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. హడావిడిగా చేసే పనికి ఆలోచనతో చేసే పనికి చాలా తేడా ఉంటుందని చాణక్యుడు తెలిపారు.
ఒక మనిషి కోపం లేదా తొందరపాటుతో వ్యవహరిస్తే ప్రతికూల ఫలితాలను పొందేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. అంటే కోపంతో పనిచేసేటప్పుడు ఆలోచన శక్తిని కోల్పోతాం అత్యుత్సాహంతో అంటే తొందరపాటుతో ఏదైనా పని చేస్తే అది ఆశించిన ప్రయోజనం దక్కదు. ఇది మనిషి అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తుందని చాణక్య తెలిపారు .అందుకే మనిషి అన్ని పరిస్థితుల్లోనూ ఓపికగా ఆలోచనతో వ్యవహరించాలి. ఓర్పు కలిగిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను నడిచే మార్గం నుండి తడబడడు. పనిచేయడానికి ముందు ఆ వ్యక్తి తప్పు ఒప్పులను వేరుచేసి పనిని విజయవంతం చేస్తాడు. అటువంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని ఆచార్య చాణక్యుడు తెలిపారు.