Daridra Devatha : ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపే 5 సూచనలు ఇవే…!
ప్రధానాంశాలు:
Daridra Devatha : ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపే 5 సూచనలు ఇవే...!
Daridra Devatha : ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో కచ్చితంగా దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట.. అలాగే ఇల్లు అసభ్యంగా ఉండి వాసన వస్తూ ఉంటే కూడా ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట. ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఇంట్లో ప్రతిరోజు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా కూడా అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. అంటే ఆ ఇంట్లో కచ్చితంగా దరిద్ర దేవత ఉందని అర్థం. నిజానికి దరిద్ర దేవతను జేష్ట దేవత లేదా ఆ లక్ష్మీ అంటారు. లక్ష్మీదేవి ఆ లక్ష్మీ ఇద్దరు కూడా వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటారు. సంపదనకు ఆదిదేవత లక్ష్మీదేవి అయితే పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించిందని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఆ విషయం చాలామందికి తెలియదు. అయితే జీవితంలో లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే మన ఇంట్లో దరిద్ర దేవత ఉందని చెప్పేటటువంటి సూచనలు ఉంటాయి.
ఈ ఐదు సూచనలు కూడా మీ ఇంట్లో కనిపిస్తే కచ్చితంగా ఇంట్లో నుంచి దరిద్ర దేవత ను దూరంగా బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. కాబట్టి కొన్ని చిట్కాలు పరిహారాలు కూడా ఉంటాయి.ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లోనూ చల్లాలి. అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి వస్తుంది. కూడా ఇక నెలకు ఒకసారి అయినా బూజులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా దరిద్ర దేవత ఇంట్లో నుంచి పారిపోతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో అగరవత్తులు వెలిగించండి. దీంతో పాటుగా ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి ,గుగ్గిలం కలిపి వారానికి ఒక్కసారి అయినా ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ధూపం అనేది చాలా శక్తివంతమైనది.. కచ్చితంగా ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే మీరు కూడా ఇంట్లో చాలా పనులు చేయకూడదు. తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు ముఖ్యంగా నిద్రపోకూడదు. చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే సూర్యుడు వచ్చేవరకు కూడా పడుకుంటూ ఉంటారు.
అలాంటి సమయంలోనే దరిద్ర దేవత ఇంటి వైపు ఆకర్షించబడుతుంది. కనుక సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా మీ ఇంటి మీద దరిద్ర దేవత ప్రతిభ ఉండకూడదు. అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి శుభ్రంగా ఉంటుంది. తిన్న తర్వాత చేయి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే కూడా దరిద్ర దేవత వచ్చి మనతో పాటే ఉంటుంది. దరిద్ర దేవత ఆకర్షించబడి ఇంట్లో ఉన్న వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. ఇక బట్టలు ఉతికిన వాళ్ళు చాలామంది నీళ్లను కాళ్ళ మీద పోసుకుంటారు. అలా పోసుకున్నా కూడా కచ్చితంగా దరిద్రం పడుతుంది. కాబట్టి ఈ విధంగా ఉండాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా నియమనిష్టలు పాటించాల్సి ఉంటుంది. అప్పుడే దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటకు పోతుంది..