Death Person In Dream : చనిపోయిన వారు కలలో కనిపిస్తే.. వెంటనే ఇలా చేయండి.. నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు
Death Person In Dream : సాధారణంగా మనిషికి కలలు రావటమనేది ఎంతో సహజం. కలల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని మంచివి, కొన్ని భయపెట్టే ఇంకొన్ని ప్రమాదకరమైనవి. కొన్ని కలలు ఎందుకు వచ్చాయో దానికి సమాధానం కూడా దొరకదు. మన ఆలోచనలు, స్వభావం, పరిస్థితులు, స్థితిగతులను బట్టి కలలు వస్తుంటాయి. మనం ఈ రోజు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో అదే మన కలలో వస్తుందని చాలా మంది చెప్తుంటారు. అలాగే దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు, తెలిసిన వారు చనిపోతే మనకు వారు కలలో కనిపిస్తుంటారు. వారితో మనకు ఉన్న జ్ఞాపకాలను బట్టి మనకు వారు కలలో కనిపిస్తారు. అయితే చనిపోయిన వారు ఇలా కలలో కనిపించడం అంటే.. అందుకు కొన్ని కారణాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో ఒకటే చనిపోయిన మన పూర్వీకులు మన కల లోకి రావడం.
సాధారణంగా చెడు కలలు వచ్చినప్పుడు మనం భయపడటం.. ఆ తర్వాత నిద్ర పట్టక పోవటం వంటివి జరుగుతాయి. కొన్ని కలల్లో ఫ్రెండ్స్ కనిపిస్తే వారు మనకు ఏదో చెప్పాలకనుకుంటున్నారని అర్థం. లేదా మన నుంచి విడిపోవడానికి ఇష్టపడకపోవటం… మనకు ఏదో సాయం చేయలనుకోవటం వంటివి జరుగుతాయట. అందుకే పెద్దలు మనకు ఈ కల వచ్చిందని చెప్పగానే వాళ్లైతే ఏం కాదు. మంచి జరుగుతది అని చెప్తుంటారు. మరో కల వచ్చిందని చెప్తే అలా రాకూడదు.. వెంటనే దైవదర్శంనం చేసుకోమ్మని సూచిస్తుంటారు. ఇలా ఒక్కడో ఒకట చోట నిత్యం జరిగేదే..

death person in dream what we have to do
అలా వచ్చినప్పుడు మనకి మంచి జరుగుతుందో, లేదా వాళ్ళు మనతో ఏదైనా చెప్పడానికి వచ్చారు లాంటి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ప్రతీ కలకి ఒక అర్థం ఉంటుంది. మామూలుగా హిందూ ఆచారాల ప్రకారం చనిపోయిన వాళ్లకి కర్మ, అలాగే వాళ్లని ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ సంవత్సరీకం కూడా చేస్తాం. పురాణాల ప్రకారం అలా క్రమం తప్పకుండా సంవత్సరికం చేసే కుటుంబాలలో మంచి జరుగుతుంది అని చెబుతారు. అలాగే ఆ చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కూడా వారిపై ఉంటాయని చెబుతారు. అంతే కాకుండా వారికి నచ్చిన పనులు.. లేదా వారు బ్రతికున్నప్పుడు చేయలేని పనులు మన ద్వారా చేయలనుకుంటారు. అలా చేసినా కూడా వాళ్ల ఆత్మశాంతించి వెళ్లిపోతారు