Money : మీ చేతిలో ధనం నిలవడం లేదా.. అయితే వెంటనే ఇలా చేయండి…!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: March 12, 2023, 6:00 am

Money : చాలామంది ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఎంత సంపాదించినా సరే అది చేతిలోకి రాగానే ఇట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే అలా ఖర్చు అవ్వకుండా డబ్బు నిలవడం కోసం ఈ విధంగా చేస్తే సరిపోతుంది అని శాస్త్ర పండితులు తెలుపుతున్నారు.. ఇప్పుడున్న రోజులలో అందరూ కూడా డబ్బు సంపాదించాలని పగలు, రాత్రి ఎంతో కష్టపడుతూ ఉంటారు. దానికోసం చాలామంది తిండి తిప్పలు మానేసి మరి డబ్బు సంపాదించడంపై ఎక్కువ చూపుతూ ఉంటారు.
అయితే సంపాదించిన ధనం చేతిలోకి రాగానే ఇట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. చాలామంది ఆర్థిక పరిస్థితులు ఎదురవ్వకూడదని రూపాయి

Devotional You don't have money in your hands

Devotional You don’t have money in your hands

రూపాయి దాచిపెట్టినప్పటికీ ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఆర్థిక సమస్యలు ఎదురవ్వడానికి వాస్తు దోషాలు కూడా కారణం అయి ఉండవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు. ప్రస్తుతం మన ఉన్న రోజులలో వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇంటి నుంచి వ్యాపార స్థలాలు, ఆఫీసులలో వరకు ప్రతి ఒక్క చోట కూడా వాస్తు విషయం ఎక్కువగా పాటిస్తూ ఉన్నారు. ఇదిలాగుంటే ఇంట్లో ధనం నిలవకపోతే కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. పిల్లలు చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువును అలాగే ఉంచుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు ఉంటే వెంటనే బయట పడేయాలి.

Money: డబ్బు చేతిలో నిలవడం లేదా.. వెంటనే వీటిని సరిదిద్దుకోండి?

అదేవిధంగా మీ ఇంట్లో ఉండే కులాయి నుండి నీళ్లు లీక్ అవుతుంటే.. వెంటనే దానిని రిపేర్ చేసుకోవాలి. అయితే నీళ్ళు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ధనం కూడా ఖర్చవుతూ ఉంటుంది. ఇక ఇంట్లోని బెడ్ రూమ్ దగ్గర ఇనపకడ్డి కానీ ఇనప వస్తువుల కానీ ఉంచటం వల్ల మంచి ధన లాభం పొందుతారు. బెడ్ రూమ్ ఎంట్రెన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపు ఇలా ఇనపకడ్డి లేదంటే ఇనుప వస్తువులు వేలాడదీస్తే మంచిది. మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవికి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అలాగే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి ధనం నగలతో కలకలలాడుతూ నవ్వుతూ కనిపిస్తూ ఉండాలి.. ఈ విధంగా పెట్టినట్లయితే ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట అడుగుపెట్టి నాట్యం చేస్తుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp