Categories: DevotionalNews

Dhantrayodashi : 100 సంవత్సరాల తర్వాత ఏర్పడిన అరుదైన యోగం… దీపావళి ముందు రోజు ఇలా చేస్తే అదృష్టం…!

Dhantrayodashi : ప్రతి ఏడాది దీపావళికి ముందు జరుపుకునే ధన త్రయోదశి ఈసారి చాలా ప్రత్యేకమైనదిగా జ్యోతిష్య నిపుణులు పరిగణించడం జరిగింది. ఎందుకంటే ఈ ఏడాది ధన త్రయోదశి రోజు అనేక ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. త్రిగ్రాహి యోగం , త్రిపుష్కరయోగం, ఇంద్రయోగం, లక్ష్మీనారాయణ యోగం, శేష మహాపురుష రాజయోగం, దాతయోగం ,సౌమ్య యోగం వంటి ఏడు రకాల అత్యంత ప్రత్యేకమైన యోగాలు ధన త్రయోదశి రోజు ఏర్పడనున్నాయి. ఇక ఈ ఏడు రకాల సుభయోగాల కారణంగా ఈ ఏడాది జరుపుకునే ధనత్రయోదశి ప్రాముఖ్యత విపరీతంగా పెరిగింది. కావున ఈ ధన త్రయోదశి పండుగ రోజు లక్ష్మీదేవి మరియు గణేశుడు విగ్రహాలతో పాటు ధనియాలు మట్టి పాత్రలు, బంగారం, వెండి ,ఇత్తడి ,రాగి , పసుపు ,వస్త్రాలు, అలంకరణ వస్తువులు , పాత్రలు ,భూమి భవనాలు వంటివి కొనుగోలు చేయడం శుభప్రదమైనదిగా పరిగణించడం జరిగింది.

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ధన త్రయోదశి పండుగ రోజు అరుదైన యాదృచ్ఛికాలు సంభవించాయి. దాదాపు 100 సంవత్సరాల తర్వాత దాదాపు అరుదైన 7 యోగాలు ధన త్రయోదశి రోజు ఏర్పడనున్నాయి. అంతేకాక ఈ ధన త్రయోదశి రోజు శుక్రుడు బుధుడు వృశ్చిక రాశిలో కలిసి సంచారం చేయనున్నారు. కావున ఈ ధన త్రయోదశి రోజు ఇంట్లో పూజలు చేయడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Dhantrayodashi పూజ ఎలా చేయాలి…

ఇక ఈ ధన త్రయోదశి రోజు పూజ చేయాలి అనుకునేవారు సాయంత్రం వేళ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా పూజ స్థలంలో కుబేరుడు మరియు లక్ష్మీదేవి చిత్రాలను లేదా విగ్రహాలను ప్రతిష్టించాలి. అనంతరం ధనవంతరి మరియు లక్ష్మీదేవి కుబేరుడు ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి పూజించాలి. దీపం వెలిగించిన తర్వాత పండ్లు పూలు సమర్పించి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజించాలి. అనంతరం నైవేద్యాలను ప్రసాదం రూపంలో కుటుంబ సభ్యులందరూ తినాలి.

Dhantrayodashi : 100 సంవత్సరాల తర్వాత ఏర్పడిన అరుదైన యోగం… దీపావళి ముందు రోజు ఇలా చేస్తే అదృష్టం…!

ఈ విధంగా ధన త్రయోదశి రోజు కుబేరుడు మరియు లక్ష్మీదేవిని పూజించడం వలన వారికి ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది. మీ ఇల్లు సుఖసంతోషాలతో సిరిసంపదలతో వెలసిల్లుతుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ధన త్రయోదశి పండుగ రోజు బంగారం వెండి అభరణాలు కొనుగోలు చేయడం చాలా శుభప్రదం. అదేవిధంగా ఇంట్లోకి ధనియాలు కొత్తిమీర చీపురువంటి వస్తువులు కొనడం కూడా చాలా మంచిది. దీనివలన మీ ఇంట్లో సిరిసంపదలు నిలిచి ఉంటాయి.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

10 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

11 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

11 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

13 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

14 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

15 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

16 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

16 hours ago