శని బాధలు ఎప్పుడు వస్తాయో మీకు తెలుసా !
బాధలు అనగానే గురుతకు వచ్చేది శని గుర్తుకువస్తాడు. అయితే గోచారం లేదా జన్మరాశి నుంచి శని ఉన్నస్థానం బట్టి శని బాధలు వస్తాయి. వీటిలో అర్థాష్టమ శని, చతుర్ద శని బాధలు వస్తాయి. ప్రస్తుతం శని వున్న స్థానాలను బట్టి కలిగే ఫలితాలను తెలుసుకుందాం…
అర్ధాష్టమ శని
జన్మరాశి నుంచి నాలుగవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబ సమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.స్ధాన చలనం,స్ధిరాస్తి సమస్యలు,వాహన ప్రమాదాలు,తల్లికి అనారోగ్యం కలుగుతాయి.
అష్టమశని- జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి.శత్రు బాదలు,ఊహించని నష్టాలు వస్తాయి.
దశమశని- జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, ఆకస్మిక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి. తండ్రితో గొడవలు. అయితే జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు, గోచారం లో గురు బలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాచడు. ఈ దోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకాలు, జపాదులు చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది.
శని శ్రమ కారకుడు,వాయు కారకుడు కాబట్టి రోజు ఉదయాన్నే వాకింగ్ కానీ, మేడిటేషన్ (గాలి పీల్చటం వదలటం) చేస్తే శని తృప్తిపడతాడు, శ్రమ కారక జీవులైన చీమలకు పంచదారగాని, తేనేగాని వెయ్యటం వల్ల కూడా శని భాదల నుండి విముక్తి లభిస్తుంది. శనిబాధల నుంచి విముక్తి కలగడానికి ఆంజనేయస్వామి, శ్రీవేంకటేశ్వరస్వామి, శివాభిషేకం చేయడం వల్ల శనిబాధలు పోతాయి.