Astology Remedies : ఇది తెలియక చాలామంది పూజలు,హోమాలు తెగ చేసేస్తారు..ఈ పని చేయండి మీ ఇంట సిరుల పంట..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Astology Remedies : ఇది తెలియక చాలామంది పూజలు,హోమాలు తెగ చేసేస్తారు..ఈ పని చేయండి మీ ఇంట సిరుల పంట..?

 Authored By aruna | The Telugu News | Updated on :7 March 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Astology Remedies : ఇది తెలియక చాలామంది పూజలు, హోమాలు తెగ చేసేస్తారు... ఈ పని చేయండి మీ ఇంట సిరుల పంట...?

Astology Remedies :  మనం జ‌న్మించిన‌ తరువాత కొన్ని పుణ్య కార్యాలను చేయాలి. అప్పుడే మనకు మోక్షం లభిస్తుంది. పాపాలు చేసిన వారికి పుణ్యఫలం లభిస్తుంది. కొంతమంది జీవితంలో చేసిన పొరపాట్లకి తమ తప్పుదిద్దుకొనుటకు ఎన్నో పూజలను, హోమాలను చేస్తుంటారు. ఎన్నో దానధర్మాలను కూడా చేస్తుంటారు. కానీ ఈ ఒక్క పని చేస్తే చాలు వీటన్నిటికీ చేసిన పుణ్యఫలం లభిస్తుంది. మన పాప కర్మలు తొలగి పుణ్యం లభిస్తుంది. అది ఏమిటంటే… మూగజీవాలకు ఆహారం పెట్టడం. ఈ మూగజీవాలకీ ఆహారాన్ని పెడితే ఎన్ని ప్రయోజనాలు మీ జీవితంలో కలుగుతాయో తెలుసా.. జంతువులే కాదు పక్షులకు కూడా ఆహారాన్ని ఇస్తే, మీ గ్రహ స్థితులలో మార్పులు సంభవిస్తాయి. గ్రహాలు అనుకూలంగా మారుతాయి. రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి జీవితంలో సుఖాలు, సంతోషాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పశువులకు, పక్షులకు క్రమం తప్పకుండా ఆహారాన్ని ఇస్తే కనుక, మీ జీవితంలో శ్రేయస్సును, సంతోషాన్ని పొందుతారు. ఇంకా కలహాలు కూడా తగ్గుతాయి . మన హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక మనిషి పూర్వ జన్మలో చేసుకున్న కర్మలే, ఈ జన్మలో కూడా మనలో వెంటాడుతూ ఉంటాయి. వీటిని అనుభవించడం కోసం విష్ణుమూర్తి నవగ్రహాల రూపంలో మనకు అనుగ్రహిస్తాడని హిందూ శాస్త్రంలో బలంగా చెప్పబడింది.

Astology Remedies ఇది తెలియక చాలామంది పూజలుహోమాలు తెగ చేసేస్తారుఈ పని చేయండి మీ ఇంట సిరుల పంట

Astology Remedies : ఇది తెలియక చాలామంది పూజలు,హోమాలు తెగ చేసేస్తారు..ఈ పని చేయండి మీ ఇంట సిరుల పంట..?

నవగ్రహాలు అనేవి ఎక్కడో ఉండవు, మన శరీరంలోనే ఉంటూ మన బుద్ధిని తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తూ ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. అందుకే కొన్ని గ్రహాల కారణంగా మంచి చేస్తారు, కొన్ని గ్రహాల కారణంగా నష్టపోతుంటారు. ఆరోగ్య సమస్యలు, ధన నష్టం, కేసులు వంటి కారణాలతో ఇబ్బంది పెడుతుంటాయి. ఇటువంటి బాధలను తప్పించుకోవాలని నవగ్రహాలు పూజలు, హోమాలు, వ్రతాలు ఇలా ఎంతో ఖర్చు పెట్టి చేస్తుంటారు. అయినా కూడా ఫలితం ఉండదు. మన తలరాతలను మార్చాలంటే కొన్ని కొన్ని కిటుకులు పురాణంలోనే ఉన్నాయి. అందులో మూగజీవాలకు ఆహారం పెట్టడం, జంతువులు, పక్షులకు వివిధ రకాల ఆహారాలను తినిపించడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో దోషాలు పరిహారమవుతాయి. పేదలకు దానధర్మాలు చేయడం. పెద్దవారిని గౌరవించడం, తల్లిదండ్రులను ఏ లోటు లేకుండా చూసుకోవడం, అహంకార భావం లేకుండా ఉండడం. ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే దైవ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే పశుపక్షాదులకు ఆహారాన్ని పెడితే ఎంతో పుణ్యం లభిస్తుంది. మరి ఏ జీవికి ఎలాంటి ఆహారం పెడితే గ్రహాలు మనకి అనుకూలంగా మారుతాయో తెలుసుకుందాం…

ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే

ముఖ్యంగా ఇక్కడ ఈ విషయం తెలుసుకోవాలి. గ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు. ఈ సూర్యుని ఆదివారం రోజున ఆరాధిస్తారు. ఆయనకి ఈ ఆదివారం ఎంతో ప్రీతికరం. అయితే ఈ రోజున జంతువులకు, పక్షులకు ఆహారాన్ని అందిస్తే జాతకంలో రవి గ్రహం బలపడుతుంది. ముఖ్యంగా ఆదివారాలలో కోతులకు గోధుమలు, బెల్లం, చపాతి ఇవ్వడంతో ఎంతో మంచిది. ఇలాంటి పరిహారాలు చేస్తే మీ జీవితంలో అదృష్టం వచ్చి మిమ్మల్ని కుబేరులను చేస్తుంది. దేనికి లోటు లేకుండా మీ జీవితం సాగిపోతుంది.

మానసిక సమస్యలకు ఇలా చేయండి

మీ ఇంట్లో మనశ్శాంతి కరువైతే, మీరు సోమవారం చంద్రునికి ప్రత్యేకంగా నమస్కారం చేసుకోండి. సోమవారం నాడు చంద్రునికి ప్రత్యేకం . గ్రహస్తితే బాగాలేని వారు తీవ్రమైన మానసిక సమస్యలు, డిప్రెషన్, చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన కలిగి బాధపడుతుంటారు. వీటన్నిటి నుంచి విముక్తి పొందాలంటే మీరు చేయాల్సింది ఈ ఒక్క పరిహారం, సోమవారం రోజున తెల్ల ఆవుకు, పిండి ముద్దలు చేసి తినిపించండి. ఇంకా అందులో కాస్త బెల్లాన్ని కూడా జోడించండి. ఇలా చేస్తే మీ జీవితంలో మనశ్శాంతి లభించే ప్రశాంతంగా జీవిస్తారు.

తెలివితేటలు పెరగాలంటే

మూగజీవాలకు ఆహారాన్ని అందించడం వల్ల బుధుడు కూడా సంతృప్తి చెందుతాడు. ఆవులకు పచ్చ గడ్డి, దాన ఇవ్వడం, పంజరాల్లో ఉన్న పక్షులను విడుదల చేసి వాటికి స్వేచ్ఛనివ్వాలి. ముఖ్యంగా మంగళవారం నాడు ఈ పనులు చేయడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయి. పిల్లలకు పాలు అందించడం కూడా మంచిదే.

ఇలా చేస్తే ఎప్పుడూ డబ్బులు గల గలే

శుక్ర గ్రహం ధనానికి కారకుడు. ఈ శుక్రుని అనుగ్రహం ఉంటే మంచి జీవిత భాగస్వామిని, ఆకర్షణను కలిగించేది కూడా శుక్రుడే. శుక్ర గ్రహం అనుగ్రహం పొందాలనుకునేవారు శుక్రవారం రోజున చేపలకు ఆహారం అందించాలి. ఇలా చేస్తే మీ జీవితంలో దోషాలన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో కూడా సంతోషంగా ఉంటారు.

కుజదోషం ఉన్నవారికి

కుజుడు జీవితంలో ప్రవేశిస్తే కలహాలు కలుగుతాయి. కుజుడు కలహకారకుడు. యుద్ధాన్ని ప్రేరేపిస్తాడు. గ్రహం శాంతి జరగకపోతే, వారెప్పుడూ ఆవేశంతో ఊగిపోతారు. అందరితో పాటు నిర్ణయాలు తీసుకుని అనేక ఇబ్బందులు పడతారు. కుజదోష నివారణ కోసం మంగళవారం నాడు కోతులకు బెల్లం ఇవ్వాలి. ఫలితంగా మీరు అంగారకుడి ఆశీర్వాదం పొందుతారు. దోష నివారణ జరుగుతుంది.

గురువు బావుంటే అంతా బాగున్నట్లే

గురువారం రోజున బృహస్పతికి అనుకూలమైన రోజు. ఈ రోజు నానబెట్టిన పప్పు, బెల్లాన్ని ఆవులకు, గుర్రాలకు ఆహారంగా పెట్టాలి. ఇలా చేస్తే గురుడి యొక్క అనుగ్రహం పొందుతారు. అంతేకాదు గురువారంనాడు పావురాలకు ఆహారం పెట్టడం కూడా ఎంతో మంచి ఫలితాన్ని అందిస్తుంది.

శని దోషాలను తొలగించాలంటే ఏం చేయాలి

శని భగవానుడు ఒకరి జాతకంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాడు. ఒక వ్యక్తి జాతకంలో శని భగవానుడు చెడిపోతే ఎన్నో ఇబ్బందులను పెడతాడు. మీరు శనివారం రోజున నూనెతో లేదా వెన్నతో తయారు చేసిన రొట్టెలను నల్ల ఆవులకు తినిపించాలి. కుక్కకు ఆహారంగా పెట్టాలి. ఇస్తే శని దోషాలు తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు వస్తాయి.

రాహువు,కేతువు

ఈ రాహు,కేతువులు సహజంగానే పాప గ్రహాలు అని చెప్పబడింది. ఈ గ్రహాలు శాంతించాలంటే గేదెలకు, ఏనుగులకు పచ్చి గడ్డిని ఆహారంగా పెట్టాలి. పెంపుడు జంతువులు లేదా కుందేలు, అవును జాగ్రత్తగా చూసుకోవాలి. చీమలకు నువ్వులను ఆహారంగా ఇచ్చి ఈ గ్రహ దోషాల నుంచి విముక్తులవుతారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది