Bonalu Festival : బోనాల పండుగ ఆషాడమాసంలోనే ఎందుకు జరుపుతారు మీకు తెలుసా…
Bonalu Festival : కొన్ని సంవత్సరాలు క్రిందట పల్లెటూరిలా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు మన తెలంగాణకు ముఖ్య పట్టణం గా మారింది. ఇప్పుడు ఈ హైదరాబాదులో ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది . అయినప్పటికీ కొన్ని పండగలు బాగా జరుపుకుంటారు ఇక్కడ ఉన్న ప్రజలు గ్రామ దేవతలను బాగా నమ్ముతూ ఉంటారు. అయితే ఆషాడ మాసంలో జరుపుకునే పండుగ బోనాల పండుగ ఈ పండగ వచ్చింది అంటే ఇక్కడ ప్రజలలో చెప్పలేని సంతోషం వీళ్ళలో కనిపిస్తుంది.ఈ బోనాల పండుగ తెలంగాణ జనాలలో హుషారు తలెత్తలా చేస్తుంది. ఈ పండగ మన రాష్ట్ర పండగ గా పేరొందింది. ఇలాంటి పండగ ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. ఈ పండగ ఆషాడ మాసం మొదలైన దగ్గర నుంచి ఆషాడమాసం ముగిసే వరకు జరుపుకుంటారు.
అంటే ఈ నెల మొత్తం జరుపుకుంటారు అయితే బోనాలను ఎత్తుతూ ఉంటారు ఆడవారు మోము మొత్తం పసుపు రాసుకొని కుంకుమతో పెద్ద బొట్లను నుదిట పెట్టుకుని పసుపు వస్త్రాలను ధరించి కొత్త బియ్యంతో వండిన అన్నాన్ని బోనంలా మార్చి కొండకి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి దానికి వేపాకుల మాలను వేసి దానిపైన దీపం వెలిగించుకుని చుట్ట గుడ్డ నెత్తిన పెట్టి దానిపైన బోనమును ఉంచి చేతులలో వేప మండల తో కాళ్లకు మువ్వలు కట్టి డప్పులతో పోతురాజులు వేషంలో మగవారు కూడా ఆడవారు మగవారు కలిసి డ్యాన్సులు వేసుకుంటూ ఎంతో గొప్పగా గోల్కొండ కోటలో వెలసిన జగదాంబకు మొదటి గురువారం వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటారు. ఇలా ఎంతో వైభవంగా జరుపుకునే అపురూపమైన ఆనందపు వెలువలు అంతకుమించిన జాతర ఇది తెలంగాణ గ్రామ సంస్కృతి నిలువుటద్దాలు కులమతాలకు అతిధంగా అనురాగాలతో ఆప్యాయంగా చేసుకునేది.
ఈ బోనాల పండుగ తరువాత సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి కి బోనం సమర్పిస్తారు ఆ వారం మొత్తం సికింద్రాబాద్ వాళ్లు బోనాలు పండగ ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఆ తర్వాత లాల్ దర్వాజా, దూల్ పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్తబస్తీ అమ్మవారి గుడిలలో బోనాలు జరుపుకుంటారు. అయితే ఈ బోనాల పండుగ ఆషాడంలో ఎందుకు జరుపుకుంటారు.. ఆషాడ మాసం అంతా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఈ వర్షాల వలన ఎన్నో జబ్బులు చుట్టూ ముడుతూ ఉంటాయి. జ్వరాలు, మలేరియా, చికెన్ గునియా, టైఫాయిడ్ ఈలాంటి జబ్బులన్నీ దరిచేరకుండా ఉండడానికి ఈ మాసం మొత్తం అమ్మవార్లకు బోనాలు సమర్పించి అందర్నీ చల్లగా చూడు తల్లి అని వేడుకుంటూ ఈ జాతరను జరుపుకుంటారు. అలాగే పంటలు మంచిగా పండాలి అని వర్షాలు మంచిగా కురవాలి అని గ్రామ దేవతలకు పసుపు కుంకుమలతో బోనాలను సమర్పించుకుంటారు.