Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల పులకరించిపోతుంది. ఒక వీధి కూడా ఆధ్యాత్మికతతో శోభతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. పోతురాజులు, డప్పుల దరువులు, భవిష్యవాణి, శివసత్తుల పూనకాలు, ఘనంగా ఊరు వాడ జాతరను తలపిస్తుంది. ముఖ్యంగా ఈ బోనాల పండుగ భాగ్యనగరంలో సంబరం అంబరాన్నుంటుంది. గానాలు బోనాలు కేవలం పండుగ మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవ,పతాక ప్రజల విశ్వాసానికి సాంప్రదాయానికి జీవన నాడి. 2025వ సంవత్సరంలో జూన్ 29న మొదలైన బోనాలు జూలై 2025 వరకు కొనసాగుతాయి…

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?
Bonalu In Telangana అమ్మవార్లకి ఆషాడం లోనే బోనాలను ఎందుకు సమర్పిస్తారు
అమ్మవార్లకి బోనాలు ఆషాడం లోనే సమర్పించుటకు వెనుక ఓ అందమైన నమ్మకం. అందమైన విశ్వాసం. కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆషాడ మాసంలో తమ పుట్టింటికి వస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఎంత ప్రేమగా, గారాబంగా చూసుకుంటామో, అదేవిధంగా జగజ్జనని అయిన అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచులా భావించి. భక్తిశ్రద్ధలతో భవనం వండి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆమెలోని రౌద్ర రూపాన్ని శాంతింపజేసి కరుణను పొందేందుకు ఈ వేడుకలు జరుపుకుంటారు.
బోనం తయారీ ఒక పవిత్ర కార్యం : భోనం అంటే భోజనం. అమ్మవారికి ప్రేమతో సమర్పించే నైవేద్యం. మహిళలు ఎంతో సుచిగా కొత్త మట్టి కుండలో పాలు,బెల్లం తో వండిన అన్నాన్ని సిద్ధం చేస్తారు. ఆ కుండకు,పసుపు,కుంకుమలతో అలంకరించి,వేపాకు కొమ్మలు చుట్టి పైన దీపారాధన చేస్తారు.మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, భవనాన్ని తలపై పెట్టుకుని డప్పుల తప్పుల నడుమ ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరుతారు. బోనం ఎత్తుకున్న మహిళలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు.అందుకు ఆమెలోని రౌద్రాన్ని శాంతింప చేయడానికి భక్తులు ఆమె పాదాలపై నీళ్లు చల్లుతూ స్వాగతం పలుకుతుంటారు.
భక్తి వెనుక దాగిన విజ్ఞానం : ప్రతి సంవత్సరము బోనాలు పండుగ జరపడానికి వెనుక ఉన్న కారణం భక్తి మాత్రమే కాదు. ఓ గొప్ప సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. పూర్వం వర్షాకాలంలో వైద్య సదుపాయాలు లేని రోజుల్లో కలరా మసూచి వంటి అంటూ వ్యాధులు ప్రబలి గ్రామాలు నాశనం అయ్యేవి. ఈ మహమ్మారి నుంచి తమను రక్షించుకోవడానికి గ్రామదేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ,మైసమ్మలను వేడుకునేవారు. ఆరాధనలో ఉపయోగించే పసుపు వేపాకులు శక్తివంతమైన యాంటీసెప్టిక్, యాంటి వైరల్ గుణాలను కలిగి ఉన్నవి. పసుపు నీళ్లు చల్లడం, వేపాకు తోరణాలు కట్టడం ద్వారా వ్యాధులు వ్యాప్తిని అరికట్టే వారు.దుష్ట శక్తులను పారద్రోలడానికి చేసే బలి కూడా ఇందులో భాగమే.అందుకే బోనాల పండుగ కేవలం ఒక వేడుక కాదు, అది తెలంగాణ ప్రజల జీవన విధానం. వారి సంస్కృతి దర్పణం, పంటలు బాగా పండాలని, ప్రజలు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ప్రకృతిని దైవంగా కొలిచే గొప్ప సంప్రదాయానికి ఇది ప్రతీక. ఈ బోనాల జాతర తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చు.