Bhavishyavani : ఉజ్జయిని మహంకాళి బోనాలలో… స్వర్ణలత భయపెడుతున్న భవిష్యవాణి… ఏం చెప్పిందో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bhavishyavani : ఉజ్జయిని మహంకాళి బోనాలలో… స్వర్ణలత భయపెడుతున్న భవిష్యవాణి… ఏం చెప్పిందో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :15 July 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Bhavishyavani : ఉజ్జయిని మహంకాళి బోనాలలో... స్వర్ణలత భయపెడుతున్న భవిష్యవాణి... ఏం చెప్పిందో తెలుసా...?

Bhavishyavani : ప్రతి ఏటా బోనాల పండుగ ను ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా స్వర్ణలత అనే మహిళకి అమ్మవారు ఆవహించడం వలన ఆమె భవిష్యవాణి చెబుతుంది. ప్రతి ఏటా కూడా ఉజ్జయిని మహంకాళి అనే ఆలయానికి బోనాలు సందర్భంగా ఆహ్వానించి భవిష్యవాణిని ఆమె చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఆమె భవిష్యవాణి చెప్పడం జరిగింది. ఆమె ఈ ఏడాది ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయో.. ఎలాంటి మహమ్మారి రాబోతుందో.. ఆమె భవిష్యత్తును తెలియజేసింది. రానున్న రోజుల్లో ఇంకా మహమ్మారి ముప్పు అగ్ని ప్రమాదాలు వంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆమె భవిష్యవాణిలో తెలియజేశారు. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి చెబుతూ రాబోయే రోజుల్లో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతి సంవత్సరము బోనాలు ఘనంగా చేస్తూ భక్తులందరూ కూడా సంతోషంగా నాకు బోనాలను సమర్పించండి, నన్ను సంతోష పెట్టండి , కోరినా కోరికలను, మీకు బంగారం చేస్తాను అని చెప్పింది..

Bhavishyavani ఉజ్జయిని మహంకాళి బోనాలలో స్వర్ణలత భయపెడుతున్న భవిష్యవాణి ఏం చెప్పిందో తెలుసా

Bhavishyavani : ఉజ్జయిని మహంకాళి బోనాలలో… స్వర్ణలత భయపెడుతున్న భవిష్యవాణి… ఏం చెప్పిందో తెలుసా…?

Bhavishyavani ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

ప్రతి ఏడాది కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలలో మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణిని వినిపించడం మనందరికీ తెలిసిందే. ప్రతి ఏటా అమ్మవారికి బోనాల జాతర అనంగా చేస్తు, సంతోషంగా సాకలు పోసి బాగా చేస్తూ ఉంటారు. అయితే, ఆ బోనాల ఉత్సవాలలో ఏదైనా పొరపాటు చేస్తే అమ్మవారికి ఆగ్రహం కలుగుతుంది. ప్రతి సంవత్సరం చేసినట్లే ఈసారి కూడా పొరపాటు చేశారు. ప్రతి సంవత్సరం చెబుతున్న, నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను. నాకు పూజలు అన్ని సక్రమంగా జరిపించాలి. వేల రాసులు నేను రప్పించుకుంటున్న అని అన్నాను. అంతే కాదు, నాకు రక్తం బలి ఇవ్వడం లేదు మీరు మాత్రం అరగిస్తున్నారు. నాకు మాత్రం ఇవ్వడం లేదు నాకు సరిగ్గా పూజలు చేయకపోతే రక్తం కక్కుకొని చస్తారు.నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు. అందుకే, మరణాలు పెరుగుతున్నాయి అని అమ్మవారు భవిష్యవాణిలో తెలియజేశారు.

నేను అసలు ఆ విషయంలో అడ్డుపడను నాకు రక్తం బలి కావాలి.నన్ను కొలిచే వారికి నేను ఎప్పుడూ తోడుగా నిలబడతాను. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది.ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.అంతేకాదు,ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయి.పంటలు బాగా పండుతాయి అని చెప్పారు.ఐదు వారాలపాటు నాకు పూజలు, సాకపోసి ఆనంద పరచాలి.నాకు రక్తం చూపించండి,లేకపోతే అల్లకల్లోలం జరుగుతుందని మాతంగి చెప్పారు. కాబట్టి ప్రతి సంవత్సరం చదువులందరూ కూడా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించండి. ఎలాంటి విపత్తులను రాకోకుండా ఆ అమ్మవారు కాపాడుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది