Black Sentiment : మీకు నలుపు రంగు వస్త్రాలంటే ఇష్టమా… వీటిని ధరిస్తే ఎన్ని అనర్ధాలో… ఎందుకో తెలుసా…?
ప్రధానాంశాలు:
Black Sentiment : మీకు నలుపు రంగు వస్త్రాలంటే ఇష్టమా... వీటిని ధరిస్తే ఎన్ని అనర్ధాలో... ఎందుకో తెలుసా...?
Black Sentiment : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా నలుపు రంగు వస్త్రాలని ఇష్టపడని వారు లేరు. ఈ నలుపు రంగు ని ఎంతో ఇష్టంగా ధరిస్తారు. అసలు ఈ నలుపు రంగు గురించి ముందు తెలుసుకుందాం.. వెలుతురు జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే చీకటిని అజ్ఞానానికి సంకేతంగా పరిగణిస్తారు. వెలుతురికి తెలుపు రంగు చిహ్నం అయితే, నలుపు రంగు చీకటికి చిహ్నం, అంతేకాదు దుఃఖానికి, నిరసనకి నలుపు రంగు చిహ్నంగా ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. మన ప్రాంతాలలో భర్త చనిపోతే మహిళలకు తెలుపు వస్త్రాలని ఇస్తారు. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం భర్త చనిపోతే తెలుపు రంగు వస్త్రాలకు బదులు నలుపు రంగు వస్త్రాలను ఇస్తారు. నలుపు రంగు వస్త్రాలనే ధరిస్తారు. ఈ ఆచారం ఎప్పటినుంచో నలుపు రంగు పై ఒక వ్యతిరేక భావన ఉంది. మరి ఈ నలుపు రంగు వస్త్రాల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా నలుపు రంగు వస్త్రాలు ఇష్టంగా ధరిస్తున్నారు. నెయిల్ పాలిష్ దగ్గర నుంచి, అన్ని మ్యాచింగ్ అయ్యేలా ధరిస్తున్నారు. ఈ రంగు ఎంతో ఆకర్షనీయంగా నలుగురిలో మనల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. ఇంకా బరువు ఎక్కువగా ఉన్నవారైతే అకేషన్ ఎలాంటిదైనా సరే నల్ల రంగు దుస్తులను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే నలుపు కాస్త సన్నగా కనిపించేలా చేస్తుంది. నలుపు పై సరైన అవగాహన లేక ప్రతి ఒక్కరు కూడా నలుపు రంగు వస్తువులకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. పూర్వంలో నలుపు రంగును ఆశుభానికి సంకేతంగా సూచించేవారు. అసలు నలుపు వస్త్రాలను ధరించటం వల్ల నిజంగా అనే సమస్యలు ఎదురవుతాయా.. అసలు పండితులు ఏమని చెబుతున్నారు తెలుసుకుందాం…

Black Sentiment : మీకు నలుపు రంగు వస్త్రాలంటే ఇష్టమా… వీటిని ధరిస్తే ఎన్ని అనర్ధాలో… ఎందుకో తెలుసా…?
Black Sentiment చావు ఇంటికి నలుపు వస్త్రం వేసుకొని వెళ్లొద్దు
మామూలుగానే నలుపు రంగు తన చుట్టూ ఉన్న ఎనర్జీని గ్రహిస్తుంది. ఎప్పుడైతే మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ లోను ప్రవేశించాలని కోరుకుంటారో అప్పుడు నలుపును ధరించవచ్చు. మీరు ఏ పని కోసమైనా బయటికి వెళ్లినప్పుడు, ఆమంగళకర కార్యాలు జరిపినప్పుడు, ఇంకా చావు ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్ల బట్టలను ధరించి వెళ్లకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీరు కూడా గ్రహించేలా చేస్తుందని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు.
నలుపుతో మానసిక సమస్యలు
మనం జీవితంలో మానసిక సమస్యలను ఎదుర్కొంటాం. మానసికంగా ధైర్యంగా ఉన్న వ్యక్తులను ఎంత పెద్ద కష్టం వచ్చినా ఏమి చేయలేవదు. మనసు బలహీనంగా ఉంటే మాత్రం తాటాకు చప్పుల్లకు కూడా మీరు బెదిరిపోతారు. మానసిక సమస్యలు ఎన్నున్నా కానీ అందులో మనం ధరించే దుస్తుల రంగు కూడా ఒకటి. ఎక్కువగా ఎవరైతే నలుపు దుస్తులను ధరిస్తారో వారు మానసిక సమస్యలకు గురవుతారని నమ్ముతారు. ప్రస్తుతం ప్రజలు మానసిక సమస్యలను కనీసం 20 నుండి 25% వరకు నల్ల బట్టలు వేసుకునే వారు మూలంగానే మానసిక సమస్యలు పెరుగుతున్నాయి అని నమ్ముతున్నారా.. అవును ఇది నిజమే అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.
ప్రమాదాలను ఏరి కోరి కొని తెచ్చుకున్నట్లే
నలుపు రంగు వస్త్రాలను వేసుకుని బయటికి వెళ్లడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు ఇది ఎంతో ప్రమాదానికి దారి తీస్తుంది. కాబట్టి, అలుపు రంగు అశుభానికి సంకేతంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో నలుపు రంగు వస్త్రాలను శని దేవునికి చిహ్నంగా కూడా భావిస్తారు. శని దేవుడు అనుగ్రహం లేనప్పుడు శనివారాలు నలుపును పూర్తిగా ధరించకూడదు. ఒకవేళ ధరిస్తే శని వల్ల కష్టాలు తప్పవు. నల్లని వస్త్రాలు ధరిస్తే శని దేవుడు మీ వెంటే ఉంటాడు. కొందరు పెద్దలు నల్లని వస్తాను ధరించవద్దని చెబుతుంటారు. నలుపు రంగు శని భగవానుడికి ఎంతో ప్రీతికరం. కావున నల్లటి వస్త్రాలను ధరించవద్దు. ఇంకా ఎండాకాలంలో నల్లని దుస్తులను ధరించి ఎండలో బయటికి వెళితే, నలుపు రంగు సూర్యకిరణాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. కావున, ఎండ దెబ్బ కొడుతుంది.