Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఇలాంటి వారిని ఇబ్బంది పెట్టొద్దు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఇలాంటి వారిని ఇబ్బంది పెట్టొద్దు..

 Authored By mallesh | The Telugu News | Updated on :11 February 2022,5:30 pm

Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందరికీ డబ్బు కావాలి. దాని కోసం ఎలాంటి పనినైనా చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఇందులో కొందరు కష్టపడి డబ్బులు సంపాదించే వారు ఉండగా.. మరి కొందరు ఇతరులను ఇబ్బందులకు గురిచేసి, మోసం చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ప్రస్తుత యుగంలో మోసం చేసి సంపాదించే వారే ఎక్కువగా ఉన్నారు. కొందరు అహంకారంతో, అహం భావంతో తమకంటే బలహీనులను వేధించడం మొదలు పెడతారు. ఇలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదట. మనకంటే తక్కువగా ఉన్నవారిని, బలహీనులను పొరపాటున సైతం వేధించవద్దట.

అలా ఎదుటి వారిని మరింత అసంతృప్తికి గురిచేస్తే.. అలాంటి వారిపై లక్ష్మీదేవి కోపగించుకుంటుంది.స్త్రీలను సనాత ధర్మంలో దేవతలుగా పూజిస్తారు. కాబట్టి ఎవరైనా సరే స్త్రీలను గౌరవించాలి. స్త్రీలతో ఎప్పుడూ అగౌరవంగా మాట్లాడొద్దు, ప్రవర్తించొద్దు. స్త్రీలను గౌరవించని వ్యక్తులపై లక్ష్మీ దేవి కోపగించుకుంటూ ఉంటుంది. అలాంటి వారి ఇంట్లో పేదరికం ఎక్కువవుతుంది. కష్టపడి పనిచేసే వ్యక్తులను గౌవరవించాలి. అలాంటి వారిని గౌరవించని వ్యక్తులపై లక్ష్మి దేవి అనుగ్రహం కలగదు. తమ వద్ద ఎంత సందప ఉన్నప్పటికీ కష్టపడి పనిచేసే వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు.

Do you want the grace of Lakshmi Devi to be upon you

Do you want the grace of Lakshmi Devi to be upon you

వారిని అగౌరవ పరచొద్దు. ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. వారిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలి. పనిచేసే వారిని నిర్లక్ష్యం చేసే లక్ష్మీదేవిని దూరం చేసుకున్నట్టు. కాబట్టి ఈ మూడు సూత్రాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇలా ఇతరులతో మంచిగా నడుచుకుంటూ, స్త్రీలను గౌరవించే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. దీని వల్ల పేదరికం దరిచేరుతుంది. సంపద ఉన్న ఎక్కువ రోజులు నిలవదు. కాబట్టి ఇలాంటి విషయాలను మర్చిపోకూడదు. ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి. కించపరచకూడదు. చిన్నచూపు చూడటం మంచిది కాదు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది