Kartika Amavasya : కార్తిక అమావాస్య రోజున ఈ వస్తువులను దానం చేస్తే పితృదేవతల అనుగ్రహం పొందినట్లే…!
ప్రధానాంశాలు:
Kartika Amavasya : కార్తిక అమావాస్య రోజున ఈ వస్తువులను దానం చేస్తే పితృదేవతల అనుగ్రహం పొందినట్లే...!
Kartika Amavasya : కార్తీక మాసం చివరి ఘట్టానికి రానే వచ్చాం. ఇక కార్తీకమాసం నెల అంతా కూడా నది స్థానాలు ఆచరించి వ్రతాలు దీపాలు పూజలను పాటిస్తారు. అయితే కార్తీకమాసం నెలరోజులు చేసిన పూజలకు పుణ్యఫలం దక్కడం కోసం కార్తీక అమావాస్య తిధి రోజున కొన్ని చర్యలను కచ్చితంగా పాటించాలి. పురాణాలలో కార్తిక అమావాస్యకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆ రోజున దీపదానం సాలగ్రామ దానం అన్నదానం ఇలా మన పరిస్థితులను బట్టి దానం చేయాలి. మరి ఈ నెలరోజులు చేసిన దాన జపాలకు ఫలితం దక్కడం కోసం ఈ అమావాస్య రోజు పితృదేవతలను ఆరాధించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో నది స్థానాన్ని ఆచరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే పితృదేవతలకు శాంతిని మోక్షాన్ని ప్రసాదించడం కోసం శ్రద్ధ కర్మలను నిర్వహిస్తారు. అంతేకాకుండా వంశపర్యంగా వస్తున్న దోషాలను పాటించడం వలన కుటుంబంలో సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ క్రమంలోనే కార్తీక అమావాస్య తిధి రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి వ్యక్తుల రాశి ప్రకారం కొన్ని వస్తువులను దానం చేయడం మంచిదని భావిస్తారు.
Kartika Amavasya : కార్తీక అమావాస్య ఎప్పుడు అంటే..
ఈ ఏడాది కార్తిక అమావాస్య తిధి నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం 10:30 గంటలకు నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1 వ తేదీ మధ్యాహ్నం 11: 51 నిమిషములకు ముగుస్తుంది. ఇక పితృదేవతలకు తర్పణం చేయడం కోసం ఉదయం తిది ప్రకారం కార్తీక అమావాస్యను నవంబర్ 30వ తేదీన జరుపుకుంటున్నారు.
ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయడం శుభప్రదం అంటే..
– మేషరాశి: మేష రాశి జాతకులు అమావాస్య తిధి రోజున వేరుశనగ చిక్కుడు గింజలు బెల్లం రాగి పిండి వస్తువులను దానం చేయడం శుభప్రదం.
– వృషభ రాశి: ఈ రాశి వారు పాలు పెరుగు వెన్నె నెయ్యి దీపం వంటి వాటిని దానం చేయండి.
– మిధున రాశి: మిధున రాశి జాతకులు పెసరపప్పు ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లు వంటి ఆహార పదార్థాలను దానం చేయడం శుభప్రదం.
– కర్కాటక రాశి: ఈ రాశి వారు కార్తీక అమావాస్య రోజున బియ్యం పిండి గోధుమపిండి మరియు పంచదార వంటి వాటిని దానం చేయడం వలన శుభం కలుగుతుంది.
– సింహరాశి: ఈ రాశి వారు రాగి పిండి ఎండు మిరపకాయలు పప్పులు, గోధుమ పిండి దానం చేయండి.
– కన్యారాశి: కన్య రాశి జాతకులు అమావాస్య తిధి రోజున డబ్బులు పెసరపప్పు వంటి వాటిని దానం చేయడం శుభప్రదం.
– తులారాశి: ఈ రాశికి చెందిన వారు బియ్యపు పిండి గోధుమపిండి ఉప్పు దానం చేయడం మంచిది.
– వృశ్చిక రాశి: వృశ్చిక రాశి జాతకులు పప్పు దుంపలు లేదా రాగులను దానం చేయడం శుభప్రదం.
– ధనస్సు రాశి: ఈ రాశి వారు బొప్పాయి అరటి పండ్లు శనగపిండి మరియు పసుపు రంగు వస్తువులను దానం చేయడం మంచిది.
– మకర రాశి: కార్తీక అమావాస్య తిది రోజున మకర రాశి జాతకులు ఆవాలు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటివి దానం చేయడం శుభప్రదం.
-కుంభరాశి: ఈ రాశికి చెందిన వారు నలుపు దుస్తువులు నల్ల దుప్పట్లు మరియు చెప్పులను దానం చేయండి.
– మీన రాశి: ఈ రాశి జాతకులు సత్తుపిండి అరటికాయలు శనగలు వంటి వాటిని దానం చేయడం మంచిది.