Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత అయినటువంటి శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం హిందువుల ఆచారం. శనివారం రోజు శనీశ్వరుని పూజించడం వలన ఆయన అనుగ్రహం లభిస్తుందని తద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని నమ్మకం. అందుకే శనివారం రోజు ఉపవాసం ఉండడంతో పాటు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ శనివారం రోజు చేసే పూజలకే కాదు చేసే పనులలో కూడా కొన్ని నియమాలను పాటించాలట. మరీ ముఖ్యంగా శనివారం రోజు కొన్ని పనులు చేయడం వలన శనీశ్వరుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. కాబట్టి పొరపాటున కూడా శనివారం రోజు ఈ పనులు అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే శనివారం రోజు వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే శనివారం రోజు కొన్ని రకాల వస్తువులు పొరపాటున కూడా కొనకూడదట. మరి ముఖ్యంగా ఇనుము ఉప్పు వంటి పదార్థాలు అసలు తీసుకోకూడదు. శనివారం రోజు ఈ పదార్థాలు తీసుకోవడం వలన శనీశ్వరుని ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కచ్చితంగా నియమాలు పాటించాలని వాటిని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి శనివారం రోజు ఎప్పటికీ కొనకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజు ఉప్పు కొనడం అనేది అశుభంగా పరిగణించడం జరిగింది. శనివారం రోజు ఉప్పు కొనుగోలు చేయడం వలన శనీశ్వరుని ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.తద్వారా రుణభారం రెట్టింపు అయ్యి అప్పుల బారిన పడతారు. అంతేకాక ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా బలహీన పడుతూ ఉంటుంది.
పురాణాల ప్రకారం శనివారం రోజు ఇనుప వస్తువులను కొనుగోలు చేయడం అనేది అసలు మంచిది కాదు. ఈ విధంగా చేయడం వలన శనీశ్వరుడు అసంతృప్తి చెందుతాడు. దీంతో కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున శనివారం రోజు ఇనుముతో తయారుచేసిన వస్తువులు అస్సలు కొనుగోలు చేయకూడదు.
నువ్వుల నూనె…
శనివారం రోజు చాలామంది పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నువ్వుల నూనెను పూజలో వినియోగిస్తారు. అయితే శనివారం రోజు నువ్వుల నూనె అసలు కొనుగోలు చేయకూడదు. ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే శనివారం రోజు నలుపు రంగు బట్టలు ధరించటం శాస్త్రంలో అశుభంగా పరిగణించడం జరిగింది. కావున ఈ నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.