Vinayaka Nimajjanam : వినాయకుని నిమజ్జనంలో తప్పులు అస్సలు చేయకండి… తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vinayaka Nimajjanam : వినాయకుని నిమజ్జనంలో తప్పులు అస్సలు చేయకండి… తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు…!

Vinayaka Nimajjanam : వినాయక చవితి ఉత్సవాల ముగింపు సమయం రానే వచ్చింది. తొమ్మిది రోజులపాటు పూజలను అందుకున్న గణపయ్య పదవరోజు గంగమ్మ ఒడిలోకి చేరతాడు. చతుర్దశి రోజున ప్రజలందరూ తమ వినాయకుల విగ్రహాలను వైభవంగా సంగీత వాయిద్యాలతో ఘనంగా ఊరేగింపు చేస్తూ నది దగ్గరకు తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. గణేషుడు వచ్చే ఏడాది మళ్లీ తమ ఇంటికి రావాలని కోరుకుంటూ నిమర్జనాలు చేస్తారు. గణేశుడి ఉత్సవాలు భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిన ప్రారంభమయ్యాయి. […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 September 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Vinayaka Nimarjanam : వినాయకుని నిమజ్జనంలో తప్పులు అస్సలు చేయకండి... తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు...!

Vinayaka Nimajjanam : వినాయక చవితి ఉత్సవాల ముగింపు సమయం రానే వచ్చింది. తొమ్మిది రోజులపాటు పూజలను అందుకున్న గణపయ్య పదవరోజు గంగమ్మ ఒడిలోకి చేరతాడు. చతుర్దశి రోజున ప్రజలందరూ తమ వినాయకుల విగ్రహాలను వైభవంగా సంగీత వాయిద్యాలతో ఘనంగా ఊరేగింపు చేస్తూ నది దగ్గరకు తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. గణేషుడు వచ్చే ఏడాది మళ్లీ తమ ఇంటికి రావాలని కోరుకుంటూ నిమర్జనాలు చేస్తారు. గణేశుడి ఉత్సవాలు భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిన ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈ పండుగను భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్దశి తేదీ వరకు కొనసాగిస్తారు. ఇలా ప్రతి ఇంట్లో లేదా ఊరిలో 10 రోజులపాటు వినాయకుడు పూజా మండపాలలో కొలువుదీరి పూజలను అందుకుంటాడు.

Vinayaka Nimajjanam అనంత చతుర్దశి పూజ తిథి మరియు శుభ ముహూర్తం..

వేద హిందు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే అనంత చతుర్దశి తీది సెప్టెంబర్ 16వ తేదీన మధ్యాహ్నం 03:10 నిమిషాలకు ప్రారంభమవుతుంది. తిరిగి మరసటి రోజు సెప్టెంబర్ 17వ తేదీన రాత్రి 11: 44 నిమిషాలకు ముగుస్తుంది. అయితే అనంత చతుర్దశి తీదిన ఉదయం 6: 20 నిమిషాల నుండి 11:44 గంటల వరకు పూజాది కార్యక్రమాలను నిర్వహించాలి.

గణేష నిమజ్జనానికి శుభ ముహూర్తం..

వేద క్యాలెండర్ ప్రకారంగా గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఉదయం 9 : 23 నుంచి సాయంత్రం 9 : 28 వరకు శుభ సమయం ఉంటుంది. అయితే ఈ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.

Vinayaka Nimajjanam వినాయకుని నిమజ్జనంలో తప్పులు అస్సలు చేయకండి తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు

Vinayaka Nimajjanam : వినాయకుని నిమజ్జనంలో తప్పులు అస్సలు చేయకండి… తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు…!

నిమజ్జనం చేసేందుకు విధానం

గణేశుడి నిమజ్జనం చేయడానికి ముందుగా చెక్క ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిని గంగాజలంతో శుద్ధి చేసి స్వస్తిక్ గుర్తు వెయ్యాలి. ఇలా దానిపై పసుపు వస్త్రాన్ని పరిచి వినాయకుడిని పెట్టండి. ఆ తరువాత గణేశుడుకి కొత్త బట్టలు ధరించి పసుపు కుంకుమ అద్దాలి. ఇక ఆసనం పై అక్షంతలు పూలు పండ్లు మోదకం వంటివి దేవుడికి సమర్పించాలి. నిమజ్జనానికి ముందు పూర్తి నియమ నిబంధనలతో గణేశుడిని పూజించాలి. గణపతిని వచ్చే ఏడాది తిరిగి తన ఇంటికి రమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి హారతి ఇవ్వండి. ఆ తరువాత గణేశుడిని ఆచార బద్దంగా నిమజ్జనం చేయండి. ఒకవేళ ఈ తొమ్మిది రోజులలో పూజాది కార్యక్రమాలలో ఏమైనా తప్పులు జరిగినట్లయితే క్షమించమని గణపతిని అడగండి

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది