Tulasi Plant : ఇంట్లో తులసి మొక్కను పెంచుతున్నారా… అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tulasi Plant : ఇంట్లో తులసి మొక్కను పెంచుతున్నారా… అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :24 September 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tulasi Plant : ఇంట్లో తులసి మొక్కను పెంచుతున్నారా... అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి...!

Tulasi Plant : హిందూమతంలో తులసి చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తులసి చెట్టుని సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ పూజలను నిర్వహిస్తారు. అయితే ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉంటుందని వేద పండితులు చెబుతారు. తులసి చెట్టుని ఇంట్లో గాలి ,వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉంచడం శ్రేయస్కరం. అలాగే తులసి చెట్టు దగ్గర గణపతి విగ్రహాన్ని ఉంచకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. దీనికి ఒక కధ కూడా ఉందంట మరి అది ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

– పురాణాల ప్రకారం ఒకరోజు వినాయకుడు నది ఒడ్డున తపస్సు చేస్తుండగా అదే సమయంలో తులసీ దేవి నదిలో నుండి వస్తుంది. అయితే తులసీదేవి వినాయకుడి అందానికి మెచ్చి తనని వివాహం చేసుకోమని కోరింది. దానికి వినాయకుడు నిరాకరించాడు. దీంతో తులసి ఆగ్రహిస్తూ నీవు రెండు వివాహాలు చేసుకుంటావని శపించింది. అందుకే తులసి చెట్టు వద్ద వినాయకుడి ప్రతిభను పెట్టకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి.

-అదేవిధంగా కార్తీక మాసంలో భక్తులు తులసి చెట్టు దగ్గర శివలింగాన్ని పెట్టి పూజలను చేస్తారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దీనికి కారణం మహావిష్ణువుకి తులసి ప్రీతికరమైనది. అయితే గత జన్మలో జలంధరుడు అనే రాక్షసుడి భార్య తులసి. అప్పుడు ఆమె పేరు బృంద. జలంద్రుడు పరమశివుడిని సంహరించడం వలన పరమశివుడిని తులసి తో పూజించకూడదని పండితులు చెబుతున్నారు.

– అంతేకాకుండా తులసి చెట్టు దగ్గర చెత్త మరియు చీపుర్లను ఉంచకూడదు. తులసి చెట్టు పవిత్రమైనది కాబట్టి ఇల్లు శుభ్రం చేసే చీపురులను అక్కడ పెడితే కష్టాలు పడాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లో అశుభం జరుగుతుందని పెద్దలు అంటారు. ఒకవేళ తులసి చెట్టు చుట్టూ చెత్త ఉంటే ఇంట్లో అనారోగ్య సమస్యలు మరియు ఆర్థికంగా నష్టపోతారు. తులసి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది.

Tulasi Plant ఇంట్లో తులసి మొక్కను పెంచుతున్నారా అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

Tulasi Plant : ఇంట్లో తులసి మొక్కను పెంచుతున్నారా… అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి…!

– ఇకపోతే తులసి చెట్టుకి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలను చేస్తారు. అలాంటి పవిత్రమైన తులసి చెట్టు దగ్గర చెప్పులు ఉంచితే ఇంట్లో ఆనందం కరువు అవుతుంది. కనుక తులసి చెట్టు ఉన్న దగ్గర చెప్పులు మరియు చెప్పులను అస్సలు ఉంచకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినవారవుతారు. దీని ఫలితంగా ఇంట్లో ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తులసి చెట్టు వద్ద ముళ్ళ చెట్లను నాటకూడదు. అవి ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ త్వరగా వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది