Shani : శని కటాక్షంతో ఈ రాశుల వారికి పట్టనున్న కుబేర యోగం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shani : శని కటాక్షంతో ఈ రాశుల వారికి పట్టనున్న కుబేర యోగం…!

 Authored By ramu | The Telugu News | Updated on :9 October 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Shani : శని కటాక్షంతో ఈ రాశుల వారికి పట్టనున్న కుబేర యోగం...!

Shani : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ఈ ప్రభావం పడుతుంది. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయి. అయితే దసరా నవరాత్రులు కొన్ని ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా దసరా నవరాత్రులలో శని దేవుడు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు.

Shani : దసరా నుండి దీపావళి వరకు శని కటాక్షం

ప్రస్తుతం శని కదలిక వలన దసరా నుండి దీపావళి వరకు నాలుగు రాశుల వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే అక్టోబర్ 3వ తేదీన శని శతభిష నక్షత్రంలోకిి ప్రవేశించాడు. ఇక నవంబర్ 15వ తేదీ వరకు ఆ నక్షత్రంలోని సంచరిస్తాడు. దీని కారణంగా దీపావళి పండుగ వరకు ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Shani : వృషభ రాశి

వృషభ రాశి వారికి శని సంచారం కారణంగా దసరా నుండి దీపావళి వరకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వీరికి ఈ సమయంలో కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వృషభ రాశి జాతకులకు కెరియర్ పరంగా మంచి లాభాలు ఉంటాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఇది అదృష్ట కాలమని చెప్పుకోవచ్చు.

మిధున రాశి.

శని గ్రహ సంచారం కారణంగా మిధున రాశి వారికి అనేక కష్టాల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే వర్తక వ్యాపారాలు చేసే వారు మంచి లాభాలను అందుకుంటారు. ఈ సమయంలో ఏ పని చేసిన అందులో విజయాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కుంభరాశి.

కుంభరాశి వారికి శని నక్షత్ర సంచారం కారణంగా దసరా నుండి దీపావళి వరకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఖర్చులను నియంత్రణలో ఉంటాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది.

Shani శని కటాక్షంతో ఈ రాశుల వారికి పట్టనున్న కుబేర యోగం

Shani : శని కటాక్షంతో ఈ రాశుల వారికి పట్టనున్న కుబేర యోగం…!

మీన రాశి.

శని నక్షత్ర సంచారం కారణంగా మీన రాశి వారికి దసరా నుండి దీపావళి వరకు లాభదాయకంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన అందులో విజయాన్ని అనుకుంటారు. ముఖ్యంగా వీరికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అయితే వర్తక వ్యాపారాలు మరియు ఉద్యోగం చేసే వారికి ఇది పురోగమించే సమయం అని చెప్పుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది