Durga Devi : దుర్గాదేవి ఈరోజు ఇలా అర్చిస్తే చాలు… ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Durga Devi : దుర్గాదేవి ఈరోజు ఇలా అర్చిస్తే చాలు… !

Durga Devi : దుర్గా దేవి.. రాక్షస సంహారాణికై అమ్మవారు ఎత్తిన అవతారం. ఎందరో రాక్షసులను సంహరించి దేవతలకు, మానవులకు రక్షణగ నిలిచిన స్వరూపం దుర్గా రూపం, అమ్మవారి అత్యంత శక్తి వంతమైన రూపాలలో, అవతరాలలో దుర్గాదేవి అవతారం ఒకటి. శరన్నవరాత్రులలో అత్యంత శక్తివంతమైన రోజు దుర్గాష్టమి. రేపు అంటే బుధవారం దుర్గాష్టమి ఈరోజు అమ్మవారిని కింది విధానంలో పూజిసై మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ విధానం తెలుసుకుందాం… శరన్నవరాత్రులలో రేపు దుర్గాష్టమి దీన్ని మహాష్టమి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 October 2021,9:40 pm

Durga Devi : దుర్గా దేవి.. రాక్షస సంహారాణికై అమ్మవారు ఎత్తిన అవతారం. ఎందరో రాక్షసులను సంహరించి దేవతలకు, మానవులకు రక్షణగ నిలిచిన స్వరూపం దుర్గా రూపం, అమ్మవారి అత్యంత శక్తి వంతమైన రూపాలలో, అవతరాలలో దుర్గాదేవి అవతారం ఒకటి. శరన్నవరాత్రులలో అత్యంత శక్తివంతమైన రోజు దుర్గాష్టమి. రేపు అంటే బుధవారం దుర్గాష్టమి ఈరోజు అమ్మవారిని కింది విధానంలో పూజిసై మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ విధానం తెలుసుకుందాం…

Durga Devi Pooja Process

Durga Devi Pooja Process

శరన్నవరాత్రులలో రేపు దుర్గాష్టమి దీన్ని మహాష్టమి గా పిలుస్తారు. ఈరోజు అమ్మవారిని ఆరాధించే విధానాలు పరిశీలిస్తే.. ఎరుపు రంగు పూలతో, ఎరుపు రంగు వస్త్రంతో అర్చించాలి. అదేవిధంగా పూజ చేసేవారు కూడా ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. అమ్మవారికి దుర్గా సూక్తం. దుర్గా అష్టోత్తరం. దుర్గా స్తోత్రంతో పూజ చేయాలి. అదేవిధంగా అమ్మవారికి రేపు సమర్పించాల్సిన నైవేద్యాలు పరిశీలిస్తే… ఎరుపు రంగు పుష్పాలు, కనకాంబరాలు, మందారాలతో అమ్మవారికి పూజ చేయాలి. రేపు దుర్గ నామాన్ని అవకాశం ఉన్నన్ని సార్లు మనసులో జపించుకోండి.

Durga Devi : నైవేద్యాలు…

Durga Devi Pooja Process

Durga Devi Pooja Process

దుర్గాష్టమి రోజున దుర్గాదేవి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు.. పులగం, పరమాన్నం నివేదన చేయాలి. అదేవిధంగా ఈరోజు గుమ్మడికాయ, బెల్లం దానం చేయాలి. పై విధంగా ఎవడైతే అమ్మవారిని అర్చిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు, గ్రహ దోషాలు, సంతాన సమస్యలు, ఈతిబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అవకాశం ఉన్నవారు పై విధంగా అర్చించండి. ఒకవేళ మీక ఇంట్లో అర్చన అవకాశం లేకుంటే దగ్గరలోని దేవాలయం లేదా దుర్గాదేవి నవరాత్రి మండపంలో పూజ, కుంకుమార్చన చేసుకోండి. దీనివల్లన మానవులలోని ఉన్న రాక్షసత్వం పాపం పూర్వ జన్మ పాపాలు పోతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది