Viral News : ఒక్క కొడుకు ఉన్నవారికి సంక్రాంతికి కీడు అంటూ చెక్కర్లు కొడుతున్న పుకార్లు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral News : ఒక్క కొడుకు ఉన్నవారికి సంక్రాంతికి కీడు అంటూ చెక్కర్లు కొడుతున్న పుకార్లు…!

Viral News : ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడు తో వచ్చిందట.. అందుకని ఒక్క కొడుకు ఉన్న ఆడవాళ్లు ఇద్దరు కొడుకులు నా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఐదు రకాల గాజులు వేయించుకోవాలి. లేదంటే ఒక్క కొడుకు కీడు తప్పదు. ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకవైపు ప్రపంచం సైన్స్ పరంగా అభివృద్ధిలో మనిషిని పోలిన మనిషిని సృష్టించేలా ముందుకు వెళ్తుంటే ఈరోజుల్లోనూ వింత ఆచారాలు మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి […]

 Authored By jyothi | The Telugu News | Updated on :9 January 2024,11:00 am

Viral News : ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడు తో వచ్చిందట.. అందుకని ఒక్క కొడుకు ఉన్న ఆడవాళ్లు ఇద్దరు కొడుకులు నా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఐదు రకాల గాజులు వేయించుకోవాలి. లేదంటే ఒక్క కొడుకు కీడు తప్పదు. ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకవైపు ప్రపంచం సైన్స్ పరంగా అభివృద్ధిలో మనిషిని పోలిన మనిషిని సృష్టించేలా ముందుకు వెళ్తుంటే ఈరోజుల్లోనూ వింత ఆచారాలు మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి.

సంక్రాంతి పండగ రాబోతున్న వేళ తాజాగా ఓ పూకారు షికారు చేస్తోంది. ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఒక కొడుకు ఉన్న వాళ్ళు ఐదు రకాల గాజులు కొనుక్కోవాలట అవి మళ్ళీ ఒక కొడుకుఉన్న వారితోనే వేయించుకోవాలి అంట. ఈ పిచ్చి ప్రచారం ఇప్పుడు పల్లెల నుంచి పట్నానికి కూడా వ్యాపించింది. ఆడవాళ్లు ఎగబడి ఎగబడి మరీ గాజులు కొంటున్నారట. కొనడమే కాకుండా గాజులు ధరించే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎటు వచ్చి ఇద్దరు కొడుకులు ఉన్నవారికి చిల్లుపడేది. ఎందుకంటే గాజులకు డబ్బులు అడిగేందుకు వచ్చిన వాళ్ళని కాదని లేరు.

అలాగని వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వలేరు. ఈ వింత ఆచార ప్రచారంపై విద్యావంతులు బగ్గుమంటున్నారు. ఆధునిక యుగంలో ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ భావితరాలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారని మండిపడుతున్నారు. గతంలో కూడా సంక్రాంతి, ఉగాది పండుగలు ముందు వదిన మరదలు గాజులు, అన్నదమ్ముల కడకలు, ఆడబిడ్డలకు కుంకుమభరణలు, ఆడపడుచులకు చీరలు అంటూ అనేక ప్రచారాలు జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటువంటి ప్రచారాలతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతారు తప్ప.. ఎలాంటి హాని జరగదని విద్యావంతులు కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి ఈ పిచ్చి ప్రచారంతో గాజుల దుకాణాల గల్లా పెట్టే గలగల అనడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది