Mysterious Temples : సైన్స్ కే అంతుచిక్కని పురాతన ఆలయాల రహస్యం…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Mysterious Temples : సైన్స్ కే అంతుచిక్కని పురాతన ఆలయాల రహస్యం…!

Mysterious Temples : మన భారతదేశంలోని ఆలయాల్లో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వీటి వెనకున్న మిస్టరీని ఛేదించడానికి ఎన్నో సంవత్సరాల నుండి పరిశోధనలు చేస్తున్న వీటికి గుట్టు మాత్రం ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. శాస్త్రవేత్తలకే సవాల్ విసురుతున్న ఐదు రహస్య శివాలయాల గురించి తెలుసుకుందాం.. మొదటిది లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం తనలోని అనువణువునా ఎన్నో రహస్యాలను దాచుకున్న మిస్టీరియస్ టెంపుల్ లేపాక్షి లోని వీరభద్ర స్వామి ఆలయం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 February 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Mysterious Temples : సైన్స్ కే అంతుచిక్కని పురాతన ఆలయాల రహస్యం...!

Mysterious Temples : మన భారతదేశంలోని ఆలయాల్లో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వీటి వెనకున్న మిస్టరీని ఛేదించడానికి ఎన్నో సంవత్సరాల నుండి పరిశోధనలు చేస్తున్న వీటికి గుట్టు మాత్రం ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. శాస్త్రవేత్తలకే సవాల్ విసురుతున్న ఐదు రహస్య శివాలయాల గురించి తెలుసుకుందాం.. మొదటిది లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం తనలోని అనువణువునా ఎన్నో రహస్యాలను దాచుకున్న మిస్టీరియస్ టెంపుల్ లేపాక్షి లోని వీరభద్ర స్వామి ఆలయం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం సమీపంలో కొలువుదీరి ఉన్న ఈ ఆలయాన్ని 15వ శతాబ్ద కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన అచ్యుతరాయుల సంస్థానంలో కోశాధికారిగా పనిచేసే విరూపణ కట్టించాడు. 70 స్తంభాలతో అద్భుతమైన శిల్ప సంపదతో నిర్మించిన ఈ ఆలయంలోని అంతరిక్ష స్తంభానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గుడిలోని 69 స్తంభాలు నేల మీద నిలబడి ఉంటే ఈ ఒక్క స్తంభం మాత్రం ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో తేలుతూ ఉంటుంది. ఈ కట్టడానికి ఒక్కసారిగా బీటలు రావడంతో ఎంతో భయపడిన ఆ ఇంజనీర్ వెంటనే ఆ పనిని విరమించుకున్నాడట. దీంతో ఇప్పటికీ ఆ పిల్లర్ ఎలా గాలిలో వేలాడుతుందనేది మిస్టరీగానే మిగిలిపోయింది. రెండవది బృహదీశ్వరాలయం తంజావూర్ బృహదీశ్వర ఆలయం. భారతదేశంలోని మిస్టీరియస్ టెంపుల్స్ లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉన్న ఈ శివాలయాన్ని 11 వ శతాబ్ద కాలంలో చోళ రాజైన రాజరాజ చోళులు నిర్మించాడు.

ఈ దేవాలయాన్ని మొత్తం గ్రానైట్ తో నిర్మించారు. ఈ దేవాలయం కట్టడానికి మొత్తం లక్ష 30 వేల టన్నుల గ్రానైట్ ని వాడారు. మరి అన్ని ఈ టన్నుల గ్రానీట్రైని ఇక్కడకు ఎలా తీసుకొచ్చారు అనేది ఇప్పటికీ పెద్ద రహస్యంగానే ఉంది. ఇక్కడ మరొక విశేషమేమిటంటే ఈ ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిల తో నిర్మించబడింది. మూడవది కైలాస దేవాలయం ఎల్లోరా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లోని కేఓ 16 లో ఈ కైలాస దేవాలయం ఉంది. ఎన్నో రహస్యాలను తనలో ఇముడుచుకుని గత చరిత్రకు సాక్షిభూతం గా నిలిచిన ఈ ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్ద కాలంలో నిర్మించారని చెబుతారు.అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారనేది ఇప్పటికీ మిస్సరీగానే ఉంది. ఇక నాలుగోది గుడిమల్లం. పరశురామేశ్వరాలయం ఈ ఆలయం తిరుపతి పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని ఏ శివాలయానికి లేని విశిష్టత గుడిమల్లం లో ఉన్న శివాలయానికి ఉంది. ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ఇక్కడి శివలింగం పురుష లింగాన్ని పోలి ఉంటుంది. ఈ లింగాన్ని ఏ రాయితో తయారు చేశారనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. గ్రహణానికి సంబంధించినది కాదని తోకచుక్క భూమిని ఢీకొనడం ద్వారా అంతరిక్షం నుండి ఈసెల భూమికి వచ్చిందని చెబుతారు. ఈ శివాలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారనేదానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఇక్కడ శివున్ని పరశురాముడు ప్రతిష్టించాడని అంటారు.ఈ ఆలయంలో గర్భాలయం అంతరాలయం ముఖ మండపములు కన్నా లోతులో ఉంటుంది..ఇక ఐదవది సోమేశ్వర స్వామి ఆలయం.

పంచారామ క్షేత్రాల్లో పూజలు అందుకుంటున్న ఉమా సోమేశ్వర స్వామి ఆలయం. భీమవరం పట్టణానికి సమీపంలోని గునుపూడి లో కొలువదీరి ఉంది. ఇక్కడ స్వామివారిని స్వయంగా చంద్రుడు స్థల పురాణం చెబుతుంది. దేవ గురువైన బృహస్పతి భార్యను చూసి మోహించిన చంద్రుడు ఆ తర్వాతఇక్కడి లింగన్లో షోడచ కళలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ సోమేశ్వర లింగం అమావాస్యనాడు నలుపు వర్ణంలోనూ పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలోనూ దర్శనమిస్తుంది. అమావాస్య పౌర్ణమికి ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఈ మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో దేవతలు నిర్మించారట. ఒకరోజు అన్నపూర్ణాదేవి రెండో అంతస్తులు కొలువుదీరి ఉండటం ప్రత్యేకత. ఈ ఆలయంలో మరో విశేషమేమిటంటే ఆలయం ముందు భాగంలో కోనేరు గట్టున రాతి స్తంభం దగ్గర నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ఇక్కడి నుండి చూస్తే ఆలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతిగుట్ట నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది