Sri Rama Navami : శ్రీ రామ నవమి రోజున సిరి సంపదల కోసం… ఏం చేయాలి, ఏం చేయకూడదు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sri Rama Navami : శ్రీ రామ నవమి రోజున సిరి సంపదల కోసం… ఏం చేయాలి, ఏం చేయకూడదు…?

 Authored By ramu | The Telugu News | Updated on :5 April 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Sri Rama Navami : శ్రీ రామ నవమి రోజున సిరి సంపదల కోసం... ఏం చేయాలి, ఏం చేయకూడదు...?

Sri Rama Navami : హిందూమతంలో లోకమంతా కూడా శ్రీరామనవమి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమికి పచ్చని పందిరిలో సీతారాముల కళ్యాణం చూసేందుకు జనులందరూ తరలివస్తారు. శ్రీరాముని పూజించే సాంప్రదాయం మాత్రమే కాదు సీతారాముల కళ్యాణం చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండి పూజలు చేసె వారు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. శ్రీరామనవమి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు వివరంగా తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకు జానకిరాముల కళ్యాణం కోసం ఏర్పాటు చేస్తున్నారు. లోకాభిరాముడు, సుగుణాభిరాముడైన శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించాలని.

Sri Rama Navami శ్రీ రామ నవమి రోజున సిరి సంపదల కోసం ఏం చేయాలి ఏం చేయకూడదు

Sri Rama Navami : శ్రీ రామ నవమి రోజున సిరి సంపదల కోసం… ఏం చేయాలి, ఏం చేయకూడదు…?

సీతారాముల ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం శ్రీరామునిగా భావిస్తారు. శ్రీరాముడు మానవుడిగా జన్మించి దేవుడిగా మారి పూజలు అందుకున్నాడు, శ్రీరాముని జననాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ పండుగలు జరుపుకుంటారు. తెలుగు క్యాలెండర్ల ప్రకారం చైత్రమాసంలో శుక్లపక్షంలో 9వ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 6న శ్రీరామనవమి జరుపుకుంటున్నారు. ఈరోజు నా మన హిందూ మతం వారు గల్లి గల్లి లో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సీతారాముల కళ్యాణం చేస్తారు. ఊరేగింపులను చేస్తారు. ఈరోజు నా శ్రీరాముని పూజించే వారు ఏం చేయాలి? ఏం చేయకూడదు అని తెలుసుకుందాం..

Sri Rama Navami శ్రీరామనవమి రోజున ఏం చేయాలంటే

-తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించాలి.
-లోక రక్షకుడైన శ్రీ రాముని పట్ల భక్తితో చేతులు జోడించి ఉపవాసం చేస్తారని ప్రతిజ్ఞ చేయండి.
– మనసు నీ నిర్మలంగా, స్వచ్ఛమైన ఆలోచనలతో ఉంచుకోండి. రోజంతా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి.
– శ్రీరామనవమి రోజున శ్రీ హనుమంతుని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
– హనుమాన్ చాలీసా, బజరంగబన్. సుందరాకాండను పటించండి.
– హనుమంతుడికి శనగలు, బెల్లం నైవేద్యంగా సమర్పించండి. సింధూరం దిద్దండి.-

రోజు నా పేదలకు ఆహారం, బట్టలు దానం చేయండి.
– రోజంతా శ్రీరామ నామాన్ని జపిస్తూ, జ్ఞానంలో రామధర్బార్ ను స్మరించుకోండి.
– ఈరోజు నా శ్రీరాముడికి పంచామృతంతో స్నానం చేయించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించండి.
– శ్రీరామనవమి రోజున శ్రీరాముని మంత్రాలను జపించండి.

శ్రీరామనవమి రోజున ఏం చేయకూడదంటే:
శ్రీరామనవమి రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటి తామసిక పదార్థాలు తినకూడదు. రోజున సాత్విక ఆహారం తినాలి.
. ఈ రోజున ఎవరు ఎవరిని అవమానించకూడదు లేదా అసభ్యకరమైన భాషను ఉపయోగించకూడదు.
. శ్రీరామనవమి రోజున అబద్ధం చెప్పవద్దు సత్యాన్ని అనుసరించాలి.
. ఈరోజున ఎవరితో కూడా గొడవ పడకుండా ఉండాలి.
. ఈరోజు మీ ఇంటికి వచ్చే అతిధి కాలి చేతులతో వెనక్కి పంపవద్దు. చేయడం వల్ల శ్రీరాముడుకు కోపంగా ఉండవచ్చు. కాబట్టి, ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి భక్తిశ్రద్ధలతో శ్రీరాముని కళ్యాణం లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ శ్రీ రాముని పూజించండి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది