Raja Singh : రాజా సింగ్ హల్‌చల్.. ఒవైసీ అరుపులకు ఎవరు భయపడరు
ప్రధానాంశాలు:
Raja Singh : రాజా సింగ్ హల్‌చల్.. ఒవైసీ అరుపులకు ఎవరు భయపడరు
Raja Singh : శ్రీ రామ నవమి ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం ధూల్‌పేట్‌లో నిర్వహించిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రకి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. డీజే స్టెప్పులకు భక్తులు ఉర్రూతలూగించేలా డ్యాన్స్‌లు చేశారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలతో పాతబస్తీ దద్దరిల్లింది.

Raja Singh : రాజా సింగ్ హల్‌చల్.. ఒవైసీ అరుపులకు ఎవరు భయపడరు
Raja Singh రాజాసింగ్ కామెంట్స్..
పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్ పాస్ అయిందని ఒవైసీ బ్రదర్స్ గగ్గోలు పెడుతున్నారని గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యంగ్యంగా అన్నారు. ఆ బ్రదర్స్ అరుపులకు ఇక్కడ ఎవరు భయపడరని ఆయన పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం గోషామహాల్‌లో ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో మోదీ.. భారత్‌ను హిందు రాష్ట్రంగా చేసే దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు.
మనమంతా ఐక్యంగా ప్రధాని మోదీకి అండగా నిలవాలని ఈ సందర్భగా ప్రజలకు ఆయన పిలుపు నిచ్చారు. ముస్లింలను మోసం చేస్తున్న వ్యక్తి ఒవైసీ అని ఆయన అభివర్ణించారు. ఒక వైపు మోడీ, మరో వైపు యోగి ఇద్దరి వైపు దేశం మొత్తం చూస్తుందన్నారు. రామ్ మందిర్ నిర్మాణం జరగదని ఓవైసీ భావించారని రాజా సింగ్ చెప్పారు. కానీ శ్రీరామనవమి రోజు జనసంద్రాని చూసి ఒవైసీ కంగుతిన్నాడని పేర్కొన్నారు.