Gurupushya Yogam : గురు పుష్య యోగంలో బంగారం కొనలేని వారు ఇది కొనుక్కోండి.. కోటీశ్వరులవుతారు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Gurupushya Yogam : గురు పుష్య యోగంలో బంగారం కొనలేని వారు ఇది కొనుక్కోండి.. కోటీశ్వరులవుతారు..!!

Gurupushya Yogam : 2024వ సంవత్సరం జనవరి మాసంలో గురుపుష్య యోగం రోజు అరకాసు బంగారం కూడా కొనలేని పరిస్థితి నుండి వడ్డానం కొనే స్థాయికి ఏ విధంగా ఎదుగుతారు.. అలాగే బంగారం కొనుక్కో లేని పరిస్థితుల్లో ఉన్నవారు దానికి సరిసమానంగా ఏ వస్తువులు కొనుక్కోవాలి. అలాగే కొనుక్కోకూడని వస్తువులు కూడా ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం..ఎప్పుడైనా పుష్య నక్షత్రం గురువారం వస్తే ఆ రోజు శుభయోగం లేదా గురు పుష్య […]

 Authored By jyothi | The Telugu News | Updated on :14 January 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Gurupushya Yogam : గురు పుష్య యోగంలో బంగారం కొనలేని వారు ఇది కొనుక్కోండి.. కోటీశ్వరులవుతారు..!!

Gurupushya Yogam : 2024వ సంవత్సరం జనవరి మాసంలో గురుపుష్య యోగం రోజు అరకాసు బంగారం కూడా కొనలేని పరిస్థితి నుండి వడ్డానం కొనే స్థాయికి ఏ విధంగా ఎదుగుతారు.. అలాగే బంగారం కొనుక్కో లేని పరిస్థితుల్లో ఉన్నవారు దానికి సరిసమానంగా ఏ వస్తువులు కొనుక్కోవాలి. అలాగే కొనుక్కోకూడని వస్తువులు కూడా ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం..ఎప్పుడైనా పుష్య నక్షత్రం గురువారం వస్తే ఆ రోజు శుభయోగం లేదా గురు పుష్య యోగం అని అంటారు. దీన్ని గురు పుష్య అమృత యోగ అని కూడా అంటారు. గురుగ్రహం విజ్ఞానానికి సంకేతం అందుకే పవిత్రంగా భావిస్తూ ఉంటారు. పుష్య నక్షత్రం శుభ్రతకు గురుత్వానికి చిహ్నం అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు. ఈ బృహస్పతి పుష్య నక్షత్రం కలిసినప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చేపట్టిన ఏదైనా కార్యాచరణ శుభప్రదంగా పూర్తవుతుంది. ఇది బృహస్పతి మరియు శని గ్రహాలు పాలిస్తాయి. బృహస్పతి గురువారం పుష్య నక్షత్రంలో వచ్చిన రోజున శుభకరమైన యోగం ఏర్పడుతుంది. దీన్నే గురు పుష్య యోగం అంటారు.

అయితే ఈసారి చూసుకున్నట్లయితే జనవరి 25వ తేదీన గురు పుష్య యోగం రావడం జరిగింది. ఈ తేదీన చూసినట్లయితే కనుక జనవరి 25 గురువారం రోజు ఉదయం ఏడు గంటల 17 నిమిషాలకు ఈ యొక్క తిథి సమయం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క గురు పుష్య యోగం రోజు మీరు ఏమైనా నూతన కార్యక్రమాలు తలపెట్టాలి. అనుకుంటే దానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు మినహాయించి మీరు ఏ శుభకార్యాలు జరుపుకున్నా కానీ ఫలితం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు షాపింగ్ చేయటం మంచిదని చాలామంది చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎక్కువ మంది బంగారం మొదలైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ముక్కుపుడకంత బంగారం కొనుగోలు చేసినా కానీ వడ్డానం కోనే స్థాయికి ఎదుగుతారు. అంటే ఏ విధంగా వారి యొక్క జీవితంలో ఆర్థికంగా డబ్బు సమకూరుతుందో వారికి అర్థం కాదు. అందుకే కచ్చితంగా కొంతైనా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రోజు గనక చూసినట్లయితే బంగారం కొనలేని స్థితిలో ఉన్నవారు ఈ యొక్క ఇత్తడి కానీ వెండి కానీ లేకపోతే రాగి కానీ ఈ వస్తువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు.. లేకపోతే కొంతమంది పసుపును కానీ పసుపు కొమ్ములను కానీ కొనుగోలు చేస్తారు. పసుపు అనేది ఎంత శుభప్రదమైందో మనందరికీ తెలుసు..

పసుపు కొనుగోలు చేయటం అనేది కూడా మీకు బంగారం కొనుగోలు చేసిన దానితో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ యొక్క గురు పుష్యయోగం రోజున శనగపప్పును కూడా కొనుగోలు చేయవచ్చు.ఇలా కొనడం వల్ల జీవితంలో పురోగతి లభిస్తుంది.. అలాగే మీ జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉంటే కనుక ఈ గురు పుష్య యోగం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేసి కుంకుమ, పప్పులను దానం చేయాలి. కుంకుమ తిలకాన్ని రాసుకోవాలి. ఈరోజున ఎవరి దగ్గర రుణాలు తీసుకోవద్దు. లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల కూడా మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయాలు చూస్తారు. ఈరోజు మీరు పుస్తకాలను, తెల్ల మిఠాయిలను కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే గురు పుష్య యోగంలో పదునైన మరియు కోణాల వస్తువులను మాత్రం అస్సలు కొనుగోలు చేయకూడదు. కాబట్టి చాకులు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. నలుపు, గోధుమ రంగు దుస్తులు తోలు, ప్లాస్టిక్ వస్తువులు మాత్రం కొనుగోలు చేయవద్దు..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది