
Kakabhushundi : రామాయణంలో కాకభూషుండి గురించి మీకు తెలుసా...!
Kakabhushundi : రామాయణ చరిత్రలో ఉత్తరాఖండ లో కాకభూషుండి పాత్ర విలక్షణమైనది. కాకభూషుండి అత్యంత జ్ఞానవంతమైనవాడు మరియు రాముని భక్తుడు. కాకభూషుండికి ఒక మహర్షి శాపం కారణంగా తన జీవితం అంత కాకిల గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు కాకభూషుండి ఎవరు.. ? రామ భక్తుడైన అతను కాకిల ఎందుకు మారాల్సి వచ్చింది..? ఇప్పుడు మనం తెలుసుకుందాం…
పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతి దేవికి శ్రీ రాముని కథను వివరించాడు. అదే సమయంలో ఒక కాకి కూడా ఈ కథని విన్నది. ఆ కాకినే మరో జన్మలో కాకభూషుండిగా పుట్టాడు. గత జన్మలో శివుని నోటి నుండి విన్న రాముని పూర్తి కథను కాకభూషుండి గుర్తుపెట్టుకున్నాడు. అయితే ఈ కథను అతను ఇతర వ్యక్తులు కూడా వివరించారు. శివుడు చెప్పిన కథని ఆధ్యాత్మ రామాయణం అంటారు.
పురాణ గ్రంథాల ప్రకారం అత్యంత జ్ఞానవంతుడు అయినా కాకభూషుండి రామభక్తుడుగా వర్ణించబడింది. రామాయణంలో రాముడికి రావణుడికి మధ్య జరిగిన యుద్ధంలో రావణుడు యొక్క కుమారుడు మేఘనాథుడు శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని పాముతో కట్టివేశారు. అప్పుడు నారద ముని ఆదేశానుసారం శ్రీరాముని లక్ష్మణుడు లను పాము బంధం నుంచి గరుత్మంతుడు విడిపించాడు.
సందేహాన్ని తొలగించిన కాకభూషుండి
శ్రీరాముడు పాముతో బంధించడం చూసి గరుత్మంతుడికి రామవతారం పై అనుమానం కలిగింది. అప్పుడు నారదుడు గరుత్మంతుడు సందేహాలను తీర్చడానికి బ్రహ్మదేవుడి వద్దకు పంపిస్తాడు. బ్రహ్మదేవుడు గరుత్మంతుని మహాదేవుని దగ్గరకు పంపిస్తాడు. మహాదేవుడు అతడిని కాకభూషుండి వద్దకు పంపిస్తాడు. కాకభూషుండి రాముని పాత్ర గురించి వివరించి గరుత్మంతుడి సందేహాలను తొలగించారు.
గరుత్మంతుడి సందేహాలను తీర్చిన తర్వాత కాకభూషుండి కాకిగా మారిన కథను అతనికి వివరించాడు. మొదట కాకభూషుండి అయోధ్య పూరీలో ఒక శుద్రుని ఇంట్లో జన్మించాడు. అతను ఒక శివ భక్తుడు. అహంకార ప్రభావంతో శివశక్తిని పరదేవతలను నిందించడం మొదలుపెట్టాడు. అలా ఒకసారి అయోధ్యలో కరువు వచ్చింది. అప్పుడు అతను ఉజ్వయానికి వెళ్ళాడు. అక్కడ అతను ఒక బ్రాహ్మణుడికి సేవ చేస్తూ అక్కడే నివసించడం మొదలుపెట్టాడు. ఆ బ్రాహ్మణుడు కూడా శివభక్తుడే కానీ ఇతర దేవతలను నిందించలేదు. ఒకరోజు గురువు కాకభూషుండి చర్యలకు బాధపడుతూ శ్రీరాములపై ఉన్న భక్తిని కాకభూషుండి కి ప్రబోధించడం ప్రారంభించాడు.
శపించిన శివుడు.
అహంకారం మత్తులో కాకభూషుండి తన గురువుని అవమానించాడు. అయితే అప్పుడు శివుడికి కోపం వచ్చింది. ఇక దీనితో గురువుని అవమానించిన కాకభూషుండిని శివుడు శపించాడు. పాము రూపంలో పుట్టిన తరువాత 1000 సార్లు అనేక జాతుల్లో జన్మించాలి అని శివుడు కాకభూషుండికి శాపం ఇచ్చాడు. కాకభూషుండిని శివుడిని క్షమించమని కోరాడు. అప్పుడు శివుడు కాకభూషుండి చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పారు.
Kakabhushundi : రామాయణంలో కాకభూషుండి గురించి మీకు తెలుసా…!
లోమాష్ ఋషి శాపం.
కాకభూషుండి శ్రీరాముని పట్ల భక్తిని పెంచుకున్నాడు. అలా చివరకు బ్రాహ్మణ శరీరాన్ని పొందాడు. కాకభూషుండి జ్ఞానాన్ని పొందడం కోసం లోమాష్ ఋషి వద్దకు వెళ్లాడు.లోమాష్ ఋషి అతనికి జ్ఞానాన్ని పెంచే దిశగా సూచనలు సలహాలు ఇచ్చే సమయంలో కాకభూషుండి లోమాష్ ఋషి తో అనెక వాదనలు చేసేవాడు. అతని ప్రవర్తనకు ఆగ్రహించిన ఋషి కాకిగా మారమని శపించాడు. వెంటనే కాకభూషుండి ఎగిరిపోయాడు. శాప విముక్తి తర్వాత ఋషి పశ్చత్తాపడే కాకిని వెనకకు పిలిచాడు. రామ మంత్రాన్ని చెప్పి అనాయాస విముక్తిని పొందే వరాన్ని ఇచ్చారు. రామ మంత్రాన్ని స్వీకరించిన కాకి కాకభూషుండి అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.