
Backward Walking : ఎప్పుడు ముందుకే కాదు, వెనక్కి నడవడం కూడా అలవాటు చేసుకోండి... ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి...!
Backward Walking : ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు కొత్త కొత్త పద్ధతులను పాటిస్తూ ఉంటారు. వాటిలో వాకింగ్ ఎంతో ముఖ్యమైనది. అంతేకాక ఎంతో సులభమైనది కూడా. నిజానికి ఈ వ్యాయామం కోసం మీరు ఏ జీమ్ లోను డబ్బు ఖర్చు పెట్టి సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే ఇతర అనవసరమైన ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. దీని ప్రయోజనాలను పొందేందుకు మీరు కొంత టైం ను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా అందరూ కూడా నేరుగా నడవటం చూసి ఉంటారు. కానీ రివర్స్ లో నడవటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని మీకు తెలుసా. మీరు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతినిత్యం కొత్త టైమ్ వెనక్కి నడవటం ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ లో వ్యాయామం చేసేందుకు టైం అసలు ఉండదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇలా వెనక్కి నడవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇది మీ శరీరం బరువు నియంత్రించేందుకు మరియు ఆరోగ్యాన్ని రక్షించేందుకు కూడా ఎంత బాగా మేలు చేస్తుంది…
వాకింగ్ అనేది పెద్ద ప్రయోజనకర వ్యాయామం. ఇది మిమ్మల్ని శారీరకంగా దృఢంగా ఉంచేందుకు ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. దీనితో పాటుగా మీరు వెనక్కి నడవడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇలా వెనక్కి అడుగులు వేయడం వలన శరీరంలోని అన్ని కండరాలు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మెదడు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ప్రతినిత్యం ఇంట్లోనే వెనక్కి నడవడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇలా ఐదు నిమిషాల పాటు దీనిని వ్యాయమంగా చెయ్యండి. అయితే వెనకకు నడవడం వలన శరీరానికి మరియు మెదడుకు సమతుల్యత సమన్వయం అనేది బాగా కుదురుతుంది. ముఖ్యంగా శరీరం మరియు మెదడు మధ్య అనుసంధానం అనేది అధికంగా ఉంటుంది. మీరు వెనకకు నడిచినప్పుడు కండరాల పైన మరియు నాడి మార్గాల పైన దృష్టి పెట్టాలి. దీనివలన మెదడు సమన్వయ సామర్థ్యాన్ని ఎంతో బాగా పెంచుకుంటుంది. అలాగే మీరు గనుక ప్రతినిత్యం వెనుకకు నడవడం అలవాటు చేసుకున్నట్లయితే మీలో స్థిరత్వం మరియు సమతుల్యత ఎంతో బాగా పెరుగుతాయి.
Backward Walking : ఎప్పుడు ముందుకే కాదు, వెనక్కి నడవడం కూడా అలవాటు చేసుకోండి… ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి…!
డైరెక్ట్ గా నడవడం కన్నా ఇలా రివర్స్ లో నడవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ప్రతిరోజు వెనక్కి నడవడం వలన కీళ్ల నొప్పుల నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వెనక్కి నడవడం వలన కేలరీలను కూడా కరిగించడంలో ఎంతో సహాయం చేస్తుంది. మీ కండరాలు ఎక్కువగా పని చేస్తాయి. ఇది కేలరీలను కూడా బర్న్ చేయడంలో ఎంతో బాగా మేలు చేస్తుంది. ఇది గుండె సంబంధించిన సమస్యల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే వెనక్కి నడవడం వలన మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. మెదడు కూడా బాగా పొదునేక్కుతుంది. అలాగే అవిజ్ఞ పనితీరు ఎంతో బాగా పనిచేస్తుంది. ఇలా వెనక్కి నడవడం వలన ఎడార్ఫిన్ ను కూడా విడుదల అవుతాయి. ఎండర్ఫిన్లు ఆనంద హార్మోన్ల జాబితాలోకి వస్తాయి. అందుకే వెనక్కి నడవడం వలన మీకు ఒత్తిడి తగినట్లు కూడా అనిపిస్తుంది. అలాగే ఆందోళన స్థాయిలు కూడా తగ్గుముఖం పడతాయి…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.