అమ్మవారి ఒడిలో శివుడు.. అరుదైన దేవాలయం మీకు తెలుసా ?
శివుడు…సకల శుభకారకుడు ఆయన. ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో శివారాధన కన్పిస్తుంది. మహాదేవుడి ఆరాధన చేయని ప్రాంతం లేదంటే ఆశ్చర్యపోవాలి. అలాంటి శివుడు దాదాపు అన్నిచోట్ల లింగరూపంలో వ్యక్తం అవుతాడు కానీ కొన్నిచొట్లు శివుడు కొన్నిప్రాంతాలలో విశేషంగా కన్పిస్తాడు. అలాంటి అరుదైన క్షేత్రాలలో ఒకదాని గురించి తెలుసుకుందాం…
పరమశివుడు కొలువైన క్షేత్రం .. ‘సురుటుపల్లి’. మహిమాన్వితమైన ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో ఉంది. శివుడు కూడా శయన రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే ‘సురుటుపల్లి’. లోకకల్యాణం కోసం హాలాహలాన్ని మింగిన శివుడు, ఆ విష ప్రభావం కారణంగా అమ్మవారి ఒడిలో సొమ్మసిల్లి .. ఆ తరువాత సేదదీరిన క్షేత్రం ఇది. ఈ సంఘటన కారణంగా కోటి మంది దేవతలు అక్కడికి చేరుకున్నారు.
పదిహేనువేల మంది దేవతలు తరలి వచ్చి ఆరాధించిన స్వామి పల్లికొండేశ్వరుడు. కొలువుదీరిన నేల సురుటపల్లి., పార్వతీదేవి ఒడిలో ఆదమరచి నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శివుడి విగ్రహాన్ని ఎక్కడా చూసి ఉండరు. పద్నాలుగు అడుగుల ఎత్తులో ఈ అరుదైన శయన శివుడి దర్శనం మనకు చిత్తూరు జిల్లాలోని సురుటపల్లి గ్రామంలోని పల్లికొండేశ్వర ఆలయంలో లభిస్తుంది. చుట్టూ బ్రహ్మ విష్ణువులు, సూర్యచంద్రాదులు, నారద తుంబురులు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్త్య, పులస్త్య, వాల్మీకి, విశ్వామిత్రాది మహర్షులు కొలువు తీరి ఉండగా శివుడు సర్వమంగళాదేవి (పార్వతీదేవి) ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిచ్చే దృశ్యం కన్నులపండుగగా ఉంటుంది.
సురుటుపల్లి పరమశివుడు దేవాలయం ఎవరు నిర్మించారు ?
తిరుపతి- చెన్నై జాతీయు రహదారిలో అరుణానది ఒడ్డున ఈ ఆలయుం కొలువుదీరి ఉంది. భక్తుల పాలిట కల్పతరువుగా భావించే ఈ ఆలయూన్ని 1344-47 మధ్యకాలంలో విజయునగరాధీశుడైన హరిహర బుక్కరాయులు నిర్మించారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ చేసినట్లు ఆలయు కుడ్యాలపై శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయు ప్రాశస్త్యాన్ని గుర్తించిన శ్రీ కంచి కావుకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర చంద్రశేఖర సరస్వతి స్వామి వారు 1979లో ఇక్కడ మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆ సందర్భంలో చంద్రశేఖర సరస్వతి
స్వాముల వారికి పరవుశివుడు దర్శన భాగ్యం కలిగడంతో ఆయన ఈ ఆలయంలోనే గడిపినట్లు స్వయంగా పేర్కొన్నారు.
శివుడు హాలాహలాన్ని మింగి సొమ్మసిల్లిన వేళ పదిహేనువేల మంది దేవతలు ఈ స్థలానికి వేంచేసినట్లు శివపురాణం చెబుతోంది. ఇక్కడ పరమేశ్వరుడిని నీలకంఠుడిగా, శ్రీ కంఠ, నంజుండస్వామిగానూ ఈ పల్లికొండేశ్వర స్వామిగా భక్తులు స్తుతిస్తారు. ఇక్కడ స్వామిని దర్శించుకుని స్వామిని సేవిస్తే సంతానయోగం, వివాహయోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం సంప్రాప్తిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం.