Ayyappa Temple : పరశురాముడు నిర్మించిన మెట్లు పంచలోహ మెట్లుగా ఎలా మారాయి…. అయ్యప్ప దేవాలయం స్వర్ణ దేవాలయం గా ఎలా మారింది….?
Ayyappa Temple : అయితే 1950లో అయ్యప్ప స్వామి ఆలయం ధ్వంసం అయినప్పుడు శ్రీ విమోచనందన స్వామి హిమాలయాల్లో బద్రీనాథ్ ఆలయంలో ఉన్నారు. ఆయన ఈ వార్త విన్న తర్వాత ఒక్క శబరిమల లో ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేశారు , కానీ భారతదేశమంతటా అయ్యప్ప స్వామి ఆలయాలను నిర్మించి , అతి త్వరలో ప్రపంచమంతట అయ్యప్ప స్వామి కీర్తించే విధంగా చేస్తానని శత్రువులకు సవాల్ విసిరాడు. ఇక ఆయన అన్నట్లుగానే , కాశి హరిద్వార్ పూనా , ముంబై , కరపత్తూర్ , శ్రీరంగపట్నం, మొదలైన ప్రదేశాల్లో అయ్యప్ప దేవాలయాలను నిర్మించారు. దీంతో నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాకుండా ఇతర దేశీయులు కూడా వచ్చి దర్శించుకుంటున్నారు.
ఇక శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య గరిష్టంగా పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డు వారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి పంబా పై వంతెన, పంబా నుండి విద్యుత్ దీపాలు, మంచినీరు, స్వాముల విశ్రాంతి కోసం పెద్దపెద్ద షెడ్లను నిర్మించారు. అయితే 1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరుశురాముడు నిర్మించిన , రాతి మెట్లు , ఉండేవి. అయితే అప్పట్లో ఆ మెట్లపై కొబ్బరికాయలను కొట్టడంతో, దాంతో మెట్లు అరిగిపోయి భక్తులకు ఎక్కడానికి ఇబ్బందిగా మారింది. దీంతో 1985 వ సంవత్సరంలో భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి పంచలోహ కవచాలు మంత్ర తంత్రాలతో కప్పడం జరిగింది . దీనివలన , పదునెట్టంబడిని ఎక్కడం సులువుతారమైంది.
అలాగే భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు జరగకుండా 1982లో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ కట్టి దానిపై నుండి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే కొండపై నుండి మాలికాపత్తూర్ దేవి గుడి వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జిని కట్టడం వలన భక్తులకు తిరగడానికి చాలా వీలుగా ఉంది . అలాగే 1990లో పంబా మరియు శబరిమల ఆలయ పరిధిలో భాగాన్ని సిమెంట్ తో కప్పేసి బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకునే విధంగా తయారు చేశారు. దీంతో వేలాది మంది మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోగలుగుతున్నారు. అలాగే ఓ బెంగళూరు భక్తుడు అయ్యప్ప గర్భగుడి పైన అలాగే గర్భ గుడి చుట్టూ కూడా , బంగారు రేకులను పెట్టించడం జరిగింది. దీంతో 2000 సంవత్సరం నుంచి శబరిమల దేవాలయం స్వర్ణ దేవాలయంగా మారింది.